తమన్నా- విజయ్ వర్మ బెడ్ రూమ్ రిలేషన్ బయటపెట్టిన సమంత.. ఫోటో వైరల్

మిల్కి బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే వీరి బెడ్ రూమ్ ఫోటోను హీరోయిన్ సమంత రివిల్ చేసేసింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నట్లు అందరి ముందు అడ్డంగా బుక్ చేసేసింది. అసలు సమంత రివిల్ చేసిన ఫోటో ఏంటి.. విజయ్ వర్మ, తమన్నా డేటింగ్ నిజమేనా ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంతల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరు స్టార్ హీరోల సరసన దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇదిలా ఉంటే.. తమన్నా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. గోవా న్యూ ఇయర్ పార్టీతో వీరి ప్రేమాయణం అప్పట్లో బయటపడింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ ఈవెంట్స్‌లో, ముంబై వీధుల్లో కనిపిస్తూ వీరు కనిపించారు.

Samantha Reveals Tamannah Vijay Varma Bedroom Photos News Goes Viral

తమన్నా, విజయ్ వర్మ కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సిరీసులో వీరు చేసిన రోమాన్స్.. ప్రేమ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఇక ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే తమన్నా.. తమ ప్రేమని అంగీకరిస్తూ రివిల్ చేసింది. అయితే ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలు వేసుకొని తిరగడం వరుకే ఉందా..? లేదా డేటింగ్ కూడా చేస్తున్నారా..? అనే దానిపై క్లారిటీ అయితే మొన్నటి వరకు లేదు.

అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫొటోతో.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారనే విషయం బయటకు వచ్చేసింది. తాజాగా సమంత, తమన్నా, విజయ్.. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. ఆ కార్యక్రమంలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోని సమంత షేర్ పంచుకుంది. ఆ పిక్ లో సమంత, తమన్నాని కౌగిలించుకొని కనిపిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న అద్దంలో విజయ్ కనిపించాడు.

Samantha Reveals Tamannah Vijay Varma Bedroom Photos News Goes Viral

దీంతో సమంత, తమన్నాని ఫోటో తీస్తున్న విజయ్ ఆ అద్దంలో కనిపిస్తుండంతో వీరు కలిసే ఉంటున్నారనే వార్తలు నిజమయ్యాయి. ఇక ఈ పిక్ లో గమనిస్తే.. సమంత పార్టీ డ్రెస్సులో ఉంటే, తమన్నా అండ్ విజయ్ మాత్రం నార్మల్ రూమ్ లో ధరించే డ్రెస్సులోఉండటంతో.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా, విజయ్ కలిసే ఉంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఒక్క ఫొటోతో సమంత.. తమన్నా, విజయ్‌ల డేటింగ్ ని బయటపెట్టేసిందిగా అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X