Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నీ సినిమా పక్కా ప్లాప్... ఇడియట్ అంటూ విరుచుకుపడ్డ సమంత!
టాప్ హీరోయిన్ సమంత త్వరలో 'ఓ బేబీ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మహిళా ప్రధాన చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత మనసుకు నచ్చి చేసిన చిత్రాల్లో ఇదీ ఒకటి.
ఈ సినిమా కోసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టిన సామ్.... తన ట్విట్టర్ ఖాతాలో పేరు 'బేబీ అక్కినేని'గా మార్చుకున్నారు. గతంలో ఏ సినిమాకూ సామ్ ఈ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించలేదు. అంతా సాఫీగా, హ్యాపీగా సాగుతుండగా ఓ నెటిజన్ ఈ సినిమా విషయంలో కామెంట్ చేసి సమంతకు కోపం తెప్పించాడు.
వీరి సంతోషాన్ని భరించలేక
సమంతకు మొదటి నుంచి సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే తమిళనాడులో ఓ వివాదం కారణంగా కొంతకాలంగా నిషేధం ఎదుర్కొంటున్న చిన్మయి... ఎట్టకేలకు ఈ సినిమా ద్వారా మళ్లీ డబ్బింగ్ చెప్పింది. ఇది సమంత, నందినీ రెడ్డి వల్లే సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు స్త్రీవాదులు ఈ కన్వర్జేషన్‌లోకి ఎంటరై... చిన్మయి, సమంత, నందినీ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. మరింత స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లండి లేడీస్ అంటూ వారిని ప్రోత్సహించారు. స్త్రీవాదులు అంటే వ్యతిరేకమో? లేక వీరి సంతోషాన్ని చూసి తట్టుకోలేక పోయాడో.. ఏమో? ఒక వ్యక్తి ఇందులోకి ఎంటరై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు.
మీ మూవీ పక్కా ప్లాప్ అంటూ...
‘‘ఫెమినిస్టులు అందరూ ఒకే చోట చేరారుగా... మూవీ పక్కా ప్లాప్'' అంటూ వారిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఈ కామెంటుపై సమంత వెంటనే రియాక్ట్ అయ్యారు. అతడికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ రిప్లై ఇచ్చారు. సమంత రిప్లైకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది
ఇడియట్ అంటూ విరుచుకుపడిన సమంత
మూవీ ప్లాప్ అంటూ అతడు చేసిన కామెంటుపై సామ్ స్పందిస్తూ ‘‘హ్హ హ్హ హ్హ... ధన్యవాదాలు... ఈ ప్రపంచం ఒక ఇడియట్‌ను కలిసింది... ఒక ఇడియట్ ఈ ప్రపంచాన్ని కలిశాడు'' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. అతడికి తగిన సమాధానం ఇచ్చావంటూ అభిమానులు సమంతపై ప్రశంసలు గుప్పించారు.
ఓ బేబీ
‘ఓ బేబీ' సినిమా విషయానికొస్తే... కొరియన్ హిట్ మూవీ ‘మిస్ గ్రానీ' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో 20 ఏళ్ల అమ్మాయిగా, 60 ఏళ్ల వృద్దురాలిగా సమంత కనిపించబోతోంది. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.