Peddi: పెద్దిపై సమంత రివ్యూ.. రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్..

Samantha review on Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ ప్రీమియర్స్, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిపై సమంత రివ్యూ ఇచ్చేసింది.

పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై కిలారు వెంకట సతీష్ నిర్మించగా.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ (శివన్న), దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం చరణ్ చేసిన మేకోవర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Samantha Review on Peddi Calls Ram Charan s Performance Extraordinary Predicts Blockbuster

హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సమంంత మాట్లాడుతూ.. 'నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది టైమ్. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరచబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఈ సినిమాలో బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ తన శుభాకాంక్షలు తెలిపింది.

సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా 'చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు' అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంగస్థలం సినిమాలో కలిసి నటించిన సమయంలో చరణ్ డెడికేషన్‌ను దగ్గరగా చూసిన సమంత చెప్పిన ఈ మాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

ఇక రంగస్థలం తర్వాత సమంత-రామ్ చరణ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ సినిమాలో ఇద్దరి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సమంత, చరణ్ నటనపై ఇంతటి నమ్మకం వ్యక్తం చేయడం 'పెద్ది'పై అంచనాలను మరింత పెంచుతోంది.

మరోవైపు పెద్ది విడుదలకు ముందు నుంచే ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వం, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం, రామ్ చరణ్ కొత్త లుక్, భారీ నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం సమంత చేసిన 'పెద్ది' కామెంట్సే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X