twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఫ్యూచర్ నాకే తెలియదు.. ప్రస్తుతానికి బతికే ఉన్నా.. సమంత

    |

    సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉంటాయి. నా జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తానా అనే సందేహం వస్తుంది. కానీ వాటన్నింటిని నేను తట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను అని సమంత కంటతడి పెట్టుకొన్నది. తన పరిస్థితిని ఊహించుకొని ఎమోషనల్ అయింది. నా జీవితంలోని సమస్యలను సక్సెస్‌గా డీల్ చేశాను అని సమంత అన్నారు. ఇంకా తన ఆరోగ్యంపై సమంత వివరాలు వెల్లడిస్తూ..

    మీడియాలో రకరకాల ఊహగానాలు

    మీడియాలో రకరకాల ఊహగానాలు

    నా అనారోగ్యం గురించి చెప్పిన తర్వాత మీడియాలో రకరకాల ఊహాగానాలతో కూడిన కథనాలు వచ్చాయి. అయితే నా ప్రాణాలకు హాని ఉందని, ముప్పు ఉందని రాశారు. కానీ నాకు అలాంటి ప్రాణహాని లేదు. ప్రస్తుతానికి నేను చావలేదు. అలాంటి హెడ్‌లైన్స్ అవసరం లేదు. కానీ నా పరిస్థితి మాత్రం కష్టంగా ఉందని చెప్పగలను అని సమంత అన్నారు.

    ఆ పాత్రలు ఎందుకు చేశానా?

    ఆ పాత్రలు ఎందుకు చేశానా?

    ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ, బేబీ, యశోద పాత్రలు చేశాను. ఇలాంటి పాత్రలు ఎందుకు చేశానా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బేబీ క్లాస్ పీకే రోల్.. రాజీ ఎవరి మాట వినదు. వయోలెన్స్ చేస్తుంది. యశోద అంతా విని.. తాను చేసేది చేస్తుంది. నా మనసుకు నచ్చిన పాత్రలను చేశాననే సంతృప్తి కలిగింది అని సమంత అన్నారు.

    లైఫ్ డిసైడ్ చేస్తుంది అంటూ

    లైఫ్ డిసైడ్ చేస్తుంది అంటూ

    యశోద తర్వాత ఏమిటంటే.. ప్రస్తుత నా పరిస్థితి.. జీవితంలో ఏది అనుకొన్నట్టు జరగదు అనే పాఠాన్ని నేర్పించింది. ఫ్యూచర్ ఏమిటంటే అంటే.. జీవితమే డిసైడ్ చేస్తుంది. నా జీవితం పట్ల నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు అని సమంత అన్నారు.

    యశోద షాక్.. సర్‌ప్రైజ్

    యశోద షాక్.. సర్‌ప్రైజ్

    యశోద సినిమా విషయానికి వస్తే.. మన సమాజంలో జరుగుతున్న ఓ ప్రధానమైన విషయం. ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. యశోద షాక్ ఇస్తుంది.. ఆడియెన్స్ సర్‌ప్రైజ్ చేస్తుంది. సూపీరియర్ టెక్నికల్ అంశాలు ఉంటాయి. మణిశర్మ సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫి, మార్తాండ్ కే వెంకటేష్ వర్క్ చాలా బాగుంటుంది అని సమంత అన్నారు.

    English summary
    Actor Samantha Ruth Prabhu Exclusive interview: Action episode will thrill in Yashoda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X