Samantha Ruth Prabhu : అతనితో సినిమా చేసి తప్పు చేశా... సమంత షాకింగ్ కామెంట్స్?

స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన సామ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తన గ్లామర్, టాలెంట్ తో చిన్న సినిమాలు మొదలు ఏకంగా స్టార్ హీరోలకు జోడిగా నటించే స్థాయికి ఎదిగింది. కేవలం హీరోల సరసన నటించడం మాత్రమే కాకుండా... ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సమంత తన కెరీర్ లో ప్రాధాన్యత ఇచ్చింది. అలా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇదిలా ఉంటే సమంత రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటివరకు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా మొదటగా సమంత రూత్ ప్రభు తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య సరసన 'ఏ మాయ చేసావే' చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే నాగచైతన్యతో దీటుగా నటించింది. ఒక మాట చెప్పాలంటే నాగచైతన్య కంటే సమంతకే ఆ సినిమాతో పేరు ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం ఇది. ఆ చిత్రం పాటలు ఇప్పటికీ యువత మొబైల్స్ లో మోగుతూనే ఉంటాయి.

Samantha Ruth Prabhu about Ye Maya Chesave Movie Here is her viral Comments

కాగా రీసెంట్ గా ' ఏ మాయ చేసావే' సినిమా వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సమంత తన మొదటి సినిమాను గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేసిందని సోషల్ మీడియా వేదికన వైరల్ అవుతుంది. ఏ మాయ చేసావే చిత్రం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు తన మనసులోని మాటలు తెలియజేసింది. 'కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవని, కానీ కొందరు ఈజీగా మర్చిపోతారు..' అని తన మెమోరీస్ ని గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు... కొన్ని చిత్రాల్లో కొందరితో నటించడం తాను చేసిన తప్పుగాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఏ మాయ చేసావే సినిమా 15 ఏళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మాటలు తన మాజీ భర్త నాగచైతన్య ను ఉద్దేశించే మాట్లాడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏదేమైనా నాగచైతన్య, సమంత విడిపోవడం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచింది. పలు సందర్భాల్లో కారణాలను పరోక్షంగా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంతే.

Samantha Ruth Prabhu about Ye Maya Chesave Movie Here is her viral Comments

Take a Poll

2021లో సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడింది. ఏడాది పాటు సినిమాలకు కూడా దూరంగానే ఉండింది. ఇక రీసెంట్ గా రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన అమెరికన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ తో అలరించింది. నెక్స్ట్ మరిన్ని సిరీస్ లతో, చిత్రాలతో ఆకట్టుకునేందుకు సమంత సిద్ధమవుతుంది. ఇక నాగచైతన్య రీసెంట్ గానే తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకొని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. రీసెంట్ గా నే హనీమూన్ కూడా వెళ్లారు. ఇక సమంత బాలీవుడ్ లో దర్శకుడు రాజ్ నిడిమూరు తో కలిసి తరచుగా కనిపిస్తోంది. దీంతో ఆమె అతనితో రిలేషన్ షిప్ లో ఉందని అంతట ప్రచారం జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X