నాగార్జునకి షాకిచ్చిన సమంత .. నాగచైతన్యతో విడాకులు అందుకే?, అలా వదిలించుకున్నారంటూ..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ హాట్ టాపిక్‌గా మారిన అంశం సమంత - నాగచైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎవ్వరూ ఊహించని విధంగా విడాకులు తీసుకోవడం చిత్ర పరిశ్రమను, అభిమానులను కలచివేసింది. ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకుని నాలుగేళ్లు కావొస్తున్నా నేటికీ దీని చుట్టూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత - నాగచైతన్యలు అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారన్న దానిపై కారణం తెలియదు. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరోసారి చిత్ర పరిశ్రమకు చర్చకు దారి తీసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఏమాయ చేశావే సినిమాలో నాగచైతన్య - సమంతలు తొలిసారిగా కలిసి నటించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సమంత- నాగచైతన్యలు చాలా కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగానే ఉంచారు. అయితే మీడియా మాత్రం వీరి మధ్య ఏదో జరుగుతోందని కథనాలు రాసింది. ఎక్కువ రోజులు దాచడం మంచిది కాదని గ్రహించిన ఈ జంట తమ బంధాన్ని బయటపెట్టి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది.

క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాలను అనుసరించి నాగచైతన్య , సమంతలు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు వారి సన్నిహితులు వీరి వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నాగార్జున ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించింది. నాగచైతన్య ఫ్లాట్‌లో వీరిద్దరూ కాపురం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి , విడివిడిగా సినిమాలు చేస్తూ వచ్చారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో భర్తకు హెయిర్ కట్ చేస్తూ.. మొక్కలు పెంచుతూ వీరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

samantha ruth prabhu akkineni naga chaitanya divorce reason citadel Actress social media like sparks fresh debate

రేపో మాపో శుభవార్త చెబుతారని అంతా అనుకుంటూ ఉండగా సమంత - నాగచైతన్యలు షాకిచ్చారు. తన పేరుకు ముందున్న అక్కినేని ఇంటిపేరు తీసేయడంతో పాటు గతంలో నాగచైతన్యతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ ఖాతాల నుంచి సమంత తొలగించడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వెంటనే చైతూ- సామ్‌లు విడాకులు తీసుకోబోతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇద్దరికి ఫ్యామిలీ కోర్ట్ విడాకులు మంజూరు చేసిన తర్వాత ఈ విషయాన్ని సమంత, నాగచైతన్యలు వేర్వేరుగా ప్రకటించడంతో అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు.

విడాకుల అనంతరం చైతన్య, సమంతలు ఎవరి దారులు వారు చూసుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. సామ్ డిప్రెషన్‌లోకి వెళ్లడంతో పాటు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో దాని నుంచి కోలుకున్నారు. నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి గతేడాది డిసెంబర్‌లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. సమంత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఆమె కూడా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి.

అయితే సమంత - నాగచైతన్యల విడాకులకు దారితీసిన కారణాలు ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. మీడియా, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వండి వార్చింది. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. రిలేషన్, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, మహిళల వికాసం తదితర అంశాలపై ఆమె ఇన్‌‌స్టాగ్రామ్‌లో గత కొంతకాలంగా అవగాహన కల్పిస్తున్నారు సమంత. అలాగే ఆన్‌లైన్‌లో అలాంటి పోస్టులు, వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.

తాజాగా సక్సెస్ వెర్స్ అనే ఇన్‌స్టా ఖాతాలో వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఓ చర్చ జరిగింది. వివాహ బంధంలో భర్త తీవ్ర అనారోగ్యానికి గురైతే భార్య అతనిని విడిచిపెట్టాలని అనుకోదని.. కానీ భార్య ఏదైనా అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలించుకుంటున్నాడని ఓ సర్వేలో తేలినట్లుగా ఆ యూజర్ పోస్ట్ చేశాడు. దీనికి దాదాపు 60 వేల మంది లైక్ చేయగా.. సమంత కూడా దీనిని లైక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎవరికి వారు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X