కరణ్ జోహార్ షోలో రెచ్చిపోయిన అక్షయ్.. సమంతను అమాంతం ఎత్తుకుని రచ్చ!
విడాకుల తర్వాత సమంత ఏం చేసినా అది వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సూపర్ స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకున్న సమంత. ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తున్న సమంత అనూహ్యంగా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మెరిసింది. అయితే ఈ ప్రోగ్రాంకి ఆమెతో కలిసి హాజరైన అక్షయ్ కుమార్ ఆమెను తన చేతులతో ఎత్తుకొని షోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

రెండవ ఎపిసోడ్లో
బాలీవుడ్ లో పాపులర్ షో అయిన కాఫీ విత్ కరణ్ తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల సీక్రెట్స్ బయట పెట్టే షోగా ఈ షోకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఈ షోకి సంబంధించిన ఏడవ సీజన్ ప్రారంభమైంది. కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే ఈ షో అందుబాటులో ఉంది. ఈ షోకి సంబంధించిన రెండవ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఇద్దరూ కలిసి సందడి చేశారు.

కలిసి సందడి
ఇక మూడో ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ సమంత కలిసి సందడి చేయబోతున్నారు. తాజాగా వీరిద్దరి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను కరణ్ జోహార్ తన ఇన్స్టా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. సుమారు 55 సెకండ్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకొని స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా పక్కపక్కనే కూర్చుని కనిపించారు.

కేజిఎఫ్ సినిమాలా
ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంత పెళ్లి గురించి ప్రశ్నిస్తూ ఉండగా అన్ హ్యాపీ మ్యారేజస్ అన్నిటికి కారణం మీరే అంటూ సమంత కామెంట్ చేసింది. అదేమిటి అంటే కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన కబీ ఖుషి కభీ ఘం అనే సినిమా చూసి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళందరూ అంతా ఆనందంగా ఉంటారని అనుకున్నామని కానీ రియల్ లైఫ్ మాత్రం కేజిఎఫ్ సినిమాలాగా ఉందని చెప్పుకొచ్చింది.

స్టేజ్ పైనే
ఒకవేళ క్రిస్ రాక్ టీనా అంటే అక్షయ్ భార్యపై జోక్ చేస్తే మీ రియాక్షన్ ఏమిటి అని అక్షయ్ కుమార్ ని అడిగితే దానికి అక్షయ్ కుమార్ అంతే వేగంగా నేను అతడి అంత్యక్రియలకు డబ్బులు చెల్లిస్తానని అనడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో తన భార్యపై రాక్ జోక్ వేయడంతో విల్ స్మిత్ మీద స్టేజ్ పైనే అతని చెంప పగలగొట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కరణ్ జోహార్ ఎలా ప్రశ్నించాడు.

రణవీర్ సింగ్
తర్వాత సమంతను మీరు బ్యాచిలర్ పార్టీ హోస్ట్ చేస్తే ఏ ఇద్దరి బాలీవుడ్ హీరోలను డాన్స్ చేయమని అడుగుతారంటే సమంత ఒకటి రణవీర్ సింగ్ రెండు కూడా రణవీర్ సింగ్ అంటూ అతని మీద తనకు ఉన్న ప్రేమను బయట పెట్టింది. ఆసక్తికరంగా సాగిపోతున్న ఈ ప్రోమో ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచేసింది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











