అమెరికాలో ప్రియుడితో సమంత షికార్లు.. పెళ్లిపై రాజ్ నిడిమోరు భార్య హాట్ కామెంట్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో జాబితాలో ప్రస్తుతం సమంత రూత్ ప్రభు కూడా చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తన టాలెంట్ తో చిత్ర పరిశ్రమలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మరోవైపు తనకంటూ మార్కెట్ ను కూడా ఏర్పరుచుకుంది. అదేవిధంగా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇలా కెరీయర్ పరంగా ఎంత ఎదుగుతుందో.. ఇక వ్యక్తిగతంగా అంతలా ఇబ్బందిపడింది. తన డివోర్స్ తర్వాత ఇప్పుడిప్పుడే హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో సమంత రెండో పెళ్లిపై వార్తలు ఊపందుకున్నాయి. కాగా తాజాగా ఆమె అమెరికాలో బాలీవుడ్ దర్శకుడితో కలిసి చక్కర్లు కొడుతున్న ఫొటోలను పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

నాలుగేళ్లుగా సింగిల్ గానే..
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాతనే సమంత లైఫ్ మారిపోయింది. ఆమె తొలిచిత్రం 'ఏమాయ చేశావే'. అక్కినేని నాగ చైతన్యతో కలిసి సమంత రూత్ ప్రభు నటించింది. ఈ చిత్రం ఇప్పటికీ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఇక చిత్రంతో నాగచైతన్య సమంత రూత్ ప్రభు ప్రేమలో పడ్డారు. 2017లో వీరి వివాహాం ఘనంగా జరిగింది. 4 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితం 2021లో ముగిసిన సంగతి తెలిసిందే. సడెన్ గా వీరిద్దరూ డివోర్స్ ప్రకటించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక నాగచైతన్య రీసెంట్ గానే శోభితా ధూళిపాళ్లను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా సమంత సింగిల్ గానే ఉంది.

Samantha Ruth Prabhu and Director Raj Nidimoru Spotted Together in America

రెండో పెళ్లికి సమంత ఏర్పాట్లు?
సమంత రూత్ ప్రభు తన అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి షికార్లు చేస్తున్న కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ అధికారిక అకౌంట్ ద్వారా పంచుకుంది. దాంతో మళ్లీ సమంత రెండో పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం సమంత అక్కడే రెండో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. సమంత రాజ్ నిడిమోరు క్లోజ్ గా ఉన్న ఓ ఫొటోతో అతి త్వరలోనే వారి పెళ్లి ఖాయమని అంటున్నారు.

రాజు నిడిమోరు భార్య షాకింగ్ పోస్ట్..
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వానికి ప్రశంసలు దక్కాయి. ఇక ఆయన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కలిసి పనిచేయడంతో వారిద్దరి రిలేషన్ షిప్ ప్రారంభమైందని పుకార్లు. ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో రాజ్ నిడుమోరు భార్య శ్యామలి దే షాకింగ్ గా స్పందించింది. తాజాగా సమంత, రాజ్ నిడుమోరు అమెరికాలో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఒకవైపు అయితే.. మరోవైపు ఆమె Been There.. Done that అనే ఆంగ్ల జాతీయ పదంతో స్పందించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇది నాకు ముందే తెలుసు.. అని దాని అర్థం కావడం విశేషం. ఇంతకీ ఆమె ముందే ఏం తెలుసు.. అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆమె సమంత, రాజ్ నిడిమోరు పైననే స్పందించిందా? లేకా మరే దానిపైనైనా స్పందించిందా అని నెటిజన్లు సందేహిస్తున్నారు. ఇక రాజ్ నిడిమోరుతో ఆమె 2022లోనే సెపరేట్ అయ్యిందని ప్రచారం. దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X