ఒకే ఈవెంట్‌లో సమంత... నాగచైతన్య, అందరి కళ్లు అటువైపే!

ఒకప్పుడు స్టార్ కపుల్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన జోడి సమంత- అక్కినేని నాగచైతన్య. కానీ అనివార్య కారణాలతో ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బతుకుతున్నారు. నాటి నుంచి నేటి వరకు సమంత- నాగచైతన్యలు మళ్లీ కలిసింది లేదు. ఏమాయ చేశావే రీ రిలీజ్ సందర్భంగా ఒకే వేదిక మీదకు వీరిద్దరూ వస్తారని ప్రచారం జరిగింది కానీ అది కూడా గాలివార్తగానే మిగిలిపోయింది. అలాంటిది సమంత- నాగచైతన్యలు ఒకే ఈవెంట్‌లో కనిపించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఏమాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య - సమంత మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు డేటింగ్ తర్వాత వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేశారు. కానీ సమంత- చైతన్యల మధ్య ఊహించని విధంగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. తన సోషల్ మీడియా ఖాతాలలో అక్కినేని ఇంటి పేరును తొలగించడం, చైతన్యను అన్‌ఫాలో చేయడం, భర్తతో కలిసున్న ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం వంటి పనులతో సమంత ఈ విడాకుల రూమర్స్‌కు మరింత బలం చేకూర్చారు. ఆ తర్వాత 2021లో తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు నాగచైతన్య - సమంతలు అధికారికంగా ప్రకటించారు.

Samantha Ruth Prabhu and Naga Chaitanya attend same Wedding Reception with Their Partners Go Viral

సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన సమంత.. గతేడాది డిసెంబర్‌లో ఆయనను పెళ్లాడారు. ప్రస్తుతం రెండు జంటలు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. నాగచైతన్య వృషకర్మ సినిమాలో నటిస్తుండగా.. సమంత తన సొంత నిర్మాణ సంస్ధ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం మూవీని నిర్మిస్తూ నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ సహా పలువురు విచ్చేశారు. ఇక అందరిలోకి సమంత- నాగచైతన్యలు ఈ వేడుకకు ప్రత్యేకగా ఆకర్షణగా నిలిచారు. నాగార్జున - అమలతో కలిసి నాగచైతన్య - శోభితలు ఈ రిసెప్షన్‌కు విచ్చేశారు. ఆ కాసేపటికే తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఆ ప్రాంగణానికి విచ్చేయడంతో మీడియా కెమెరాలు, సినీ ప్రముఖుల చూపు అటే నెలకొంది.

విడాకుల వీరిద్దరూ ఏ కుటుంబ కార్యక్రమానికి కానీ, సినిమా ఈవెంట్‌లో కానీ పాల్గొనలేదు. అంతేకాదు సమంత- నాగచైతన్యలు తమ గుర్తులను చెరిపివేసే పనిలో పడ్డారు. ఈ జంట ప్రేమలో, వైవాహిక బంధంలో ఉన్నప్పుడు ఇద్దరూ కొన్ని టాటూలు వేయించుకున్నారు. అయితే విడిపోయిన తర్వాత వీరిద్దరూ వాటిని తొలగించేందుకు కష్టపడ్డారు. అయితే సమంత తన మెడపై ఉన్న వైఎంసీ అనే టాటూ మాత్రం దానిని అలాగే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. చై, సామ్ జంటగా నటించిన తొలి సినిమా కావడంతో పాటు తమ బంధానికి శ్రీకారం చుట్టిన సినిమా కావడంతో ఏమాయ చేశావే మూవీ వీరిద్దరికి ఎంతో ప్రత్యేకం. ఎన్నో వివాదాలు, గొడవల తర్వాత విడిపోయి రెండో పెళ్లిళ్లు కూడా చేసుకున్న తర్వాత ఒకే ఫంక్షన్‌కు నాగచైతన్య, సమంతలు తమ జీవిత భాగస్వాములతో కలిసి రావడం చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X