సమంత‌తో రాజ్ నిడిమోరు సహజీవనం.. వాస్తవం చెప్పిన సామ్ మేనేజర్

స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఫోటోలు ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. దాంతో వారి మధ్య ఉన్న బంధం పెళ్లికి దారి తీస్తున్నదనే విషయంపై ఓ వర్గం ఓ నిర్ణయానికి వచ్చారు. ఇలా రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. దాంతో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం జరిగింది. సమంత మేనేజర్ చెప్పిన వివరాల్లోకి వెళితే..

సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమా భారీ సక్సెస్‌ అందుకొన్నది. నిర్మాతగా తన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో రాజ్ నిడిమోరు భుజంపై వాలిపోయి ఆనందంగా కనిపించడం అందరిలో కొన్ని అనుమానాలు వచ్చేలా చేశాయి.

Samantha Ruth Prabhu and Raj Nidimoru

రాజ్ నిడిమోరుతో సమంత సెల్పీ ఫోటో ఓ వైపు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటే.. సడెన్‌గా మరో విషయం మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలీ డే నర్మగర్బంగా ఓ పోస్టు పెట్టి.. తనలోని భావోద్వేగాన్ని వెల్లడించడం సమంత డేటింగ్ రూమర్లకు లింక్ అయ్యేలా చేసింది. దాంతో వారి వ్యవహారం మరింత గందరగోళంగా మారింది.

అయితే సమంత, రాజ్ నిడిమోరు కలిసి జీవించడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. వారిద్దరు సహజీవనం చేయడానికి నిర్ణయం తీసుకొన్నారు. అందుకోసం ఇంటిని కొనుగోలు చేయడానికి, ఇంటికి సంబంధించిన వస్తువులను సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు అనే వార్త జాతీయ మీడియాలో ప్రచురించారు. అయితే ఇలాంటి రూమర్లు హద్దు దాటిపోతుంటే..సమంత మేనేజర్ మహేంద్ర రంగంలోకి దిగి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Take a Poll

సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ రూమర్లపై మేనేజర్ స్పందిస్తూ.. వారిద్దరి మీద వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు. ఆ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే విషయం అబద్దం. ఇవన్నీ రూమర్లే అని మేనేజర్ మహేంద్ర జాతీయ మీడియా హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన వివరణలో వెల్లడించారు. దాంతో సమంత, రాజ్ డేటింగ్ రూమర్లకు తెరపడే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. చిత్ర యూనిట్‌తో కలిసి సమంత ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా విజయంలో పాత్ర పోషించిన ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తొలి సినిమాకు విజయం దక్కడం, కేవలం 10 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో తాను హిట్ కొట్టడం ఆనందంగా ఉంది అని ఈవెంట్‌లో సమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా వేడుకలో చిత్రంలో నటించిన వారందరూ పాల్గొన్నారు. రాజ్ నిడిమోరు ఈ ఫంక్షన్‌కు హాజరుకాలేదు. ఈ వేడుకలో అందరూ ఎమోషనల్‌గా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X