Samantha : అతడి బిగి కౌగిలిలో సమంత.. ఇది ఆరంభం మాత్రమే అంటూ ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఎప్పుడూ ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూనే ఉంటారు. సినిమాల సంఖ్య తగ్గించినా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఇటీవల షేర్ చేసిన ఓ ఫోటో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. ఇంతకీ ఏం జరిగింది?

ఇటీవల సమంత ప్రారంభించిన తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'సీక్రెట్ అల్కమిస్ట్' (Secret Alchemist) లాంచింగ్ ఈవెంట్‌లో తీసుకున్న ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో సమంత టాప్‌లెస్ స్టైల్ డిజైనర్ డ్రెస్‌లో అద్భుతంగా మెరిసిపోయారు. ఆమె గ్లామరస్ లుక్‌కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే, ఈ ఈవెంట్ ఫోటోలలో హైలైట్‌గా నిలిచింది రాజ్ నిడిమోరుతో ఉన్న పిక్. ఆ ఫోటోలో రాజ్ ఒక చేత్తో విస్కీ గ్లాస్ పట్టుకుని ఉండగా.. మరో చేతిలో సమంత నడుముపై చేయి వేసి బిగిగా కౌగిలించుకున్నట్లు కనిపించారు. చాలా క్లోజ్ గా ఉన్నా పోజు అభిమానుల్లో, నెటిజన్లలో ఆసక్తి రేపింది. "ఇది కేవలం స్నేహం మాత్రమేనా?" అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Samantha Ruth Prabhu and Raj Nidimoru Spark Dating Rumors After Viral Photo from Secret Alchemist Event

ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత తన కెరీర్‌లో తీసుకున్న కొత్త అడుగుల గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ రాశారు. "గత ఏడాదిన్నర కాలంలో నా కెరీర్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. రిస్క్‌లు తీసుకోవడం నేర్చుకున్నా, నా అంతరాత్మను విశ్వసించడం మొదలుపెట్టాను. ఈ రోజు చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అత్యంత కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే," అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చలకు తెరతీశాయి.

ఇటీవలి కాలంలో సమంత ఎక్కడ కనిపించినా రాజ్ నిడిమోరు అక్కడే ఉంటున్నట్లు గమనించవచ్చు. పబ్లిక్ పార్టీలు, సినిమా ఈవెంట్లు, లండన్ వెకేషన్లు, వేడుకల్లో వీరిద్దరూ తరచూ కలసి కనిపిస్తున్నారు. అంతేకాకుండా, వారిద్దరి ఫోటోలను సమంత స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం విశేషం. వీరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే.. ఇది కేవలం వర్క్ బేస్డ్ రిలేషన్ కాదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంత, రాజ్ నిడిమోరు కలిసి పనిచేసిన ప్రాజెక్ట్స్ కూడా వీరి బంధాన్ని బలపరిచిందని టాక్.

'ది ఫ్యామిలీ మాన్ 2' వెబ్‌సిరీస్‌లో సమంత చేసిన రోల్‌కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 'సిటడెల్: హనీ బన్నీ'లో కూడా వీరిద్దరూ కలిసి వర్క్ చేశారు. అంతేకాకుండా సమంత నిర్మించిన 'శుభం' సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రానికి కూడా ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బాండ్ మరింత వ్యక్తిగతంగా మారిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సమంత తెలుగులో 'మా ఇంటి బంగారం' సినిమాలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సమంత హిందీలో 'రక్త్ బ్రహ్మాండ్‌' అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.

కెరీర్ పరంగా కొత్త దిశలో అడుగులు వేస్తున్న సమంత, వ్యక్తిగతంగా కూడా జీవితంలో కొత్త మార్గం ఎంచుకుంటున్నారని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో సమంత-రాజ్ నిడిమోరు రిలేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. చాలామంది "వీరి కెమిస్ట్రీ చూస్తుంటే పెళ్లి వార్త ఎప్పుడొస్తుందా?" అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ ఇద్దరూ ఈ రూమర్స్‌పై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. మరి చివరికి వీరి ప్రయాణం పెళ్లికి దారితీస్తుందో లేదో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X