Samantha - Raj Nidimoru: ఒకే కారులో సమంత- రాజ్ నిడిమోరు.. పబ్లిక్‌గా దొరికిపోయిన బ్యూటీ!

సమంతతో విడిపోయాక అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరి సమంత పరిస్ధితి ఏంటీ? సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అయితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత క్లోజ్‌గా ఉండటంతో త్వరలోనే సామ్ బాంబు పేలుస్తారని అంతా భావించారు. దీనికి తగినట్లుగానే వరుసగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత - రాజ్ నిడిమోరుకు సంబంధించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

రాజ్ ఎక్కడుంటే సమంత అక్కడే
ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్‌లతో సమంత నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాల దర్శకుడే రాజ్ నిడిమోరు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ మీడియాలో గత కొంతకాలంగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడ ప్రత్యక్షం కావడం.. ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలు వచ్చాయి.

Samantha Ruth Prabhu and Raj Nidimoru Spotted in same car after leaving Restaurant

రాజ్‌తో అమెరికాలో చక్కర్లు
ఇటీవలే తను నిర్మాతగా మారి సమంత తెరకెక్కించిన శుభమ్ సినిమా సక్సెస్ మీట్‌లో రాజ్ ప్రత్యక్షమయ్యాడు. అలాగే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను అతనితో కలిసి దర్శించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే సమంత దేవుడి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమల వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా అమెరికా టూర్‌కి వీరిద్దరూ వెళ్లగా.. సమంత భుజంపై రాజ్ చేతులు వేసి నడుస్తుండగా.. మరో ఫోటోలో ఇద్దరూ పక్కపక్కనే చాలా క్లోజ్‌గా కనిపించారు. డెట్రాయిట్ వీధుల్లో సమంత- రాజ్ చక్కర్లు కొట్టడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్ భార్య ఇన్‌డైరెక్ట్ పోస్ట్
సమంత- రాజ్ నిడిమోరు మధ్య రోజు రోజుకు సాన్నిహిత్యం పెరిగిపోతూ ఉండటంతో రాజ్ భార్య శ్యామాలి మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పరోక్షంగా వీరి బంధంపై వ్యాఖ్యలు చేస్తోంది. ఏ మతం వారైనా ఎదుటి వారిని బాధించవద్దనే చెబుతుందని.. ధర్మమే మనల్ని కాపాడుతుందని శ్యామాలి పేర్కొంది. శ్యామాలి- రాజ్ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. సమంతను పెళ్లాడేందుకు గాను రాజ్ త్వరలోనే తన భార్య శ్యామాలికి విడాకులు ఇవ్వబోతున్నట్లుగా గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

Take a Poll

ఒకే కారులో రాజ్ - సమంత
మీడియాలో, చిత్ర పరిశ్రమలో ఇంత జరుగుతున్నా సమంత- రాజ్ నిడిమోరు మాత్రం వీటిని ఖండించడం లేదు. తరచుగా ఇద్దరూ వెకేషన్స్‌కు వెళ్తుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలో రాజ్ - సమంతలు ఒకే కారులో వెళ్తూ కనిపించడం వైరల్‌గా మారింది. ఈ జంట ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సమంత వైట్ కలర్ కలర్ టీ షర్ట్‌లో ఉండగా.. రాజ్ సింపుల్‌గా ఉన్నారు. దీంతో ఈ జంట తమ రిలేషన్‌ను పబ్లిక్‌గా బయటపెట్టారని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఇద్దరూ రెండో పెళ్లి చేసుకుని బాంబు పేలుస్తారని చెబుతున్నారు. దీనిపై సమంత, రాజ్‌లు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. దీనిని రాజ్ అండ్ డీకేలు తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X