రాజ్ నిడిమోరుతో సమంత పూజలు.. కొత్త జర్నీ అంటూ షాకింగ్ పోస్ట్
సినిమాలు చేయకున్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఆకాశమంత ఎత్తులో ఉంది. ఇండియాలో ఫేమస్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే ఆమె పేరే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. సామ్ వ్యక్తిగత జీవితమే దీనికి కారణం. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పుకార్లకు కారణం అవుతున్నారు సమంత. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రతినిత్యం కథనాలు వస్తున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
ది ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో రాజ్‌తో పరిచయం
ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేసే సమయంలో సమంతకు, రాజ్ నిడిమోరుతో పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్ది వీరిద్దరి పరిచయం.. స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శోభితను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత - రాజ్ నిడిమోరు కూడా వివాహ బంధంతో ఒక్కటవుతారని అంతా భావించారు. అయితే వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఉన్నది ఏంటీ? అనేది ఇంత వరకు బయటపెట్టలేదు.

జంటగా చెట్టాపట్టాల్
ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో సమంత, రాజ్ కలిసి వెళ్లడం.. ఆ తర్వాత లండన్ వీధుల్లో ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, అమెరికా, దుబాయ్ పర్యటనలలో సమంత- రాజ్‌లు ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఇక కొద్దిరోజుల క్రితం ఓ రెస్టారెంట్‌లో సమంత సందడి చేసింది. అయితే ఈ సమయంలో సమంత చేతి వేలికి కొత్తగా కినిపించడంతో ఇండస్ట్రీ షాకైంది. రాజ్, సామ్‌లకు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందా అన్న చర్చ జరిగింది. కానీ కొద్దిరోజుల తర్వాత అది కూడా గాలి వార్తగానే మిగిలిపోయింది. అయితే సమంత, రాజ్‌లు మాత్రం చక్కర్లు కొట్టడం ఆగడం లేదు.
రాజ్‌తో దీవాళి వేడుకలు
కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ జిమ్‌కి కలిసి వెళ్లిన ఈ జంట.. ఆ తర్వాత రెండ్రోజుల క్రితం దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంది. రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులతో సామ్ పండుగ చేసుకున్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా ఇద్దరూ ఏమాత్రం బయటపడటం లేదు. ఇప్పటికీ తమ బంధాన్ని సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా బ్యానర్‌పై తెరకెక్కుతోన్న మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజ్‌తో కలిసి సమంత ప్రత్యేక పూజలు
మా ఇంటి బంగారం సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల దసరా సందర్భంగా నిర్వహించారు. ఈ పూజలో సమంత బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీంతో వీరిద్దరి బందం మరోసారి చర్చనీయాంశమైంది. ఇకనైనా రిలేషన్‌ను బయటపెట్టి త్వరగా పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. కాగా.. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాను తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మిస్తుండగా.. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











