ఎయిర్‌పోర్టులో సమంత హాట్ డ్యాన్స్: ఒంపుసొంపులను చూపిస్తూ వయ్యారంగా ఊపుతూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును దక్కించుకున్న నటీమణి సమంత రూత్ ప్రభు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ చాలా ఏళ్లుగా ప్రేక్షకులను ఫిదా చేస్తోందామె. అదే సమయంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమ సందడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్‌పోర్టులో సమంత హాట్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఆమె స్వయంగా షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

రెండు చోట్లా హవా చూపిస్తుంది

రెండు చోట్లా హవా చూపిస్తుంది

'ఏమాయ చేశావే' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే స్టార్‌ స్టేటస్‌ను కూడా సొంతం చేసుకుంది. మన భాషలోనే కాదు.. తమిళంలోనూ ఈ అమ్మడు సత్తా చాటుతోంది. ఇలా ఇక్కడా.. అక్కడా ఎన్నో సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. దీంతో రెండు భాషల్లోనూ ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

ఆ సిరీస్‌తో నేషనల్ రేంజ్ క్రేజ్

ఆ సిరీస్‌తో నేషనల్ రేంజ్ క్రేజ్

సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇది సమంత రేంజ్‌ను నేషనల్ లెవెల్‌కు పెరిగిపోయిందని చెప్పొచ్చు.

అవి కంప్లీట్ చేసేసిన సమంత

అవి కంప్లీట్ చేసేసిన సమంత

ప్రస్తుతం సమంత.. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రాన్ని కూడా సమంత ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే.

 ఇంగ్లీష్ మూవీ.. యశోదగా మారి

ఇంగ్లీష్ మూవీ.. యశోదగా మారి

మొదటి నుంచీ దక్షిణాది సినిమాలకే పరిమితమైన సమంత.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. ఈ విషయాన్ని సామ్ తాజాగా ప్రకటించింది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రానుంది. అలాగే, 'యశోద' అనే పాన్ ఇండియా సినిమాలోనూ టైటిల్ రోల్ చేస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇలా తెలుగులో ఏ హీరోకూ లేనంత మంది ఫాలోవర్లను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది.

 అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఓపెన్ చేసిన సమంత చాలా కాలంగా వాటిలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. ఇలా అప్పుడప్పుడూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

సమంత హాట్ డ్యాన్స్ వైరల్

విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' మూవీ నుంచి ఇటీవల 'అరబిక్ కుతు' అనే సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా సమంత దీనికి అదిరిపోయే హాట్ డ్యాన్స్ చేసింది. 'మరోసారి ఫ్లైట్ లేట్. ఈ అర్ధరాత్రి ఈ పాటతో ఇలా' అంటూ క్యాప్షన్ పెట్టింది. సామ్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లే కాకుండా సెలెబ్రిటీల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X