Samantha Ruth Prabhu సౌత్ ఇండస్ట్రీలో టాప్ లేపిన సమంత.. నయనతారను వెనుకకు నెట్టేసి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించేందుకు అన్ని భాషల నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా బయోపిక్‌ల ట్రెండ్ ఊపు అందుకోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది. ఇంతకు ముందు దక్షిణాదిన ఇలాంటి సినిమాలకు నయనతార కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని సమంత రీప్లేస్ చేస్తోంది.

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
ప్రస్తుతం మహిళా ప్రధాన్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది సమంత. మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న సమంత ఓ బేబీ, యూ టర్న్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే యశోద, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. బాలీవుడ్‌లో కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంతోనే అరంగేట్రం చేయబోతోందని సమాచారం.

నయన్ నెంబర్ వన్..
దక్షిణాదిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇటీవలి కాలంలో నయనతార ఫస్ట్ ఛాయిస్‌గా ఉండేది. మహిళా ప్రాధాన్యమున్న ఎన్నో తమిళ చిత్రాల్లో నయన్ నటించి మెప్పించింది. ఆమెకు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ మార్కెట్ ఉండడంతో నిర్మాతలు ఆమెతో సినిమాలు నిర్మించేందుకు ఎగబడేవారు. ఒక్కో సినిమాకు ఆమె రూ.4 నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేదట. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం, సహజీవనం మొదలైన కారణాలతో ఆమె ప్రస్తుతం సినిమాలను తగ్గించింది.

నయన్ తర్వాత సమంతనే..
నయన్ సినిమాలను తగ్గించడంతో సమంత రేసులోకి దూసుకొచ్చింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత దూకుడు పెంచింది. వరుసగా సినిమాలు అంగీకరిస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సమంత ఒక్క సినిమాకు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్‌తో సమంతకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు దక్షిణాది నుంచే కాకుండా హిందీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

నటనే కాదు.. గ్లామర్ కూడా..
కేవలం నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలే కాదు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించేందుకు కూడా సమంత పచ్చజెండా ఊపుతోంది. ఇటీవల పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాటలో సమంత అందాల విందు ఎంతో మందిని ఆకట్టుకుంది. సమంత కారణంగానే ఆ పాట కోట్ల సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంది. కాగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేయబోయే ఓ లవ్‌స్టోరీలో సమంత హీరోయిన్‌గా నటించనుందని టాక్.

సోషల్ మీడియాలో అందాల విందు
సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా తన హాట్ ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంది. సినిమాలతోనూ, బిజినెస్‌లతోనూ బిజీ బిజీగా ఉన్నప్పటికీ సమంత సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటుంది. ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇటీవల బీస్ట్ సాంగ్‌కు సమంత వేసిన డ్యాన్స్ వీడియో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











