Samantha Ruth Prabhu మీరు డేటింగ్ చేయండి.. నెటిజన్‌కు సమంత జవాబు ఏమిటంటే?
గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో వరుస విజయాలు అందుకొంటున్న అగ్ర నటి సమంత రుత్ ప్రభు. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనా.. ప్రొఫెషనల్‌గా తన కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. తాజాగా నెటిజన్ ఇచ్చిన సలహాపై సమంత స్పందించిన తీరు ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

యశోదతో భారీ హిట్
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో నటించిన తర్వాత సమంత రుత్ ప్రభు కెరీర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకొన్నది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత యశోద సినిమాతో మరోసారి దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను పలకరించింది. యశోద సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కూడా సుమారు 40 కోట్ల వసూళ్లను రాబట్టింది.

శాకుంతలం మూవీతో రెఢీ..
ఇక ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌తో సమంత రుత్ ప్రభు బిజీగా ఉన్నారు. శాకుంతలం సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులకు చేరువ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.

అరుదైన వ్యాధితో నుంచి
ఇక సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. నాగచైతన్యతో విడాకులు తీసుకొన్న తర్వాత తాను సింగిల్‌గానే ఉంటున్నారు. ఆమె దాంపత్య జీవితం గురించి, వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు వినిపించినా పెద్దగా క్లారిటీ లేకుండానే పోయాయి. ఇటీవల అరుదైన వ్యాధికి గురైన ఆమె.. మయోసిటీస్ నుంచి తేరుకొని సినిమా షూటింగులు హాజరువుతున్నారు.

ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ
ఇలా పలు రకాల విషయాలతో జీవితాన్ని సాగిస్తున్న సమంతను నెటిజన్ ఓ వింత కోరిక కోరారు. సమంత గారు.. నేను మీకు చెప్పే స్థితిలో లేను కానీ... మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ ట్విట్టర్‌లో ఓ నెటిజన్ తన కోరికను పోస్టు చేసింది. అయితే నెటిజన్ అభిప్రాయానికి గౌరవిస్తూ.. మీ మాదిరిగా నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పండి అంటూ సమంత తన అభిమానికి జవాబిచ్చింది.

సమంత ప్రశ్నకు నెటిజన్ ఏమన్నారంటే?
సమంత ఇచ్చిన జవాబుపై అభిమాని స్పందిస్తూ.. త్వరలోనే నీ మనసును ఎరిగిన వ్యక్తి నీతో కలుస్తాడు. గతంలో కంటే మిమ్మల్ని ఎవరూ ప్రేమించని విధంగా నిన్ను ప్రేమించే వ్యక్తి మీ జీవితంలో తారసపడుతాడు. మీ జీవితం సాజావుగా సాగుతుందని భావిస్తున్నాను అంటూ నెటిజన్ తన ప్రేమను సమంతపై కురిపించింది.
సమంత సినిమా కెరీర్ ఇలా..
సమంత రుత్ ప్రభు కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు 15 ఏళ్లుగా అగ్ర నటిగా కొనసాగుతున్నారు. తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో సిద్దమవుతున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











