Samantha పెళ్లి పెటాకులు కావడానికి కారణం నువ్వే.. కరణ్ జోహర్‌పై సమంత షాకింగ్ కామెంట్స్

సమంత రుత్ ప్రభు తన వైవాహిక జీవితం భగ్నం కావడంతో పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టిపెట్టింది. ప్రధానంగా బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్లాన్స్ చేసుకొంటున్నది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప రిలీజ్ తర్వాత సమంతకు హిందీ చిత్ర పరిశ్రమలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే షో కాఫీ విత్ కరణ్ 7 సీజన్‌లో సమంత దర్శనమిచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో కరణ్‌ జోహర్‌నే తప్పుపడుతూ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రోమోలో సమంత చెప్పిన సమాధానం ఏమిటంటే..

కాఫీ విత్ కరణ్ 7 సీజన్

కాఫీ విత్ కరణ్ 7 సీజన్


హిందీ టెలివిజన్ రంగంలో కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోకు భారీ రెస్సాన్స్ ఉంది. ఈసారి డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా ఈ షో ప్రసారం కానున్నది. అయితే తాజా సీజన్‌లో సమంత, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, సారా ఆలీ ఖాన్, జ్వానీ కపూర్, అనన్య పాండే, విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, కియారా అద్వానీ, టైగర్ ష్రాఫ్, కీర్తీ సనన్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ తదితరులు పాల్గొన్నారు.

చిలిపి, తింగరి ప్రశ్నలకు

చిలిపి, తింగరి ప్రశ్నలకు


అయితే కరణ్ జోహార్ షోలో సమంత రుత్ ప్రభు, అక్షయ్ కుమార్ కలిసి పాల్గొనడం విశేషం. అయితే కరణ్ వేసే చిలిపి, తింగరి ప్రశ్నలకు అంతే మొత్తంలో సమాధానం చెప్పినట్టు ప్రోమోలో కనిపించింది. అక్షయ్ కుమార్‌ను ఆటపట్టిస్తూ కరణ్, సమంత కనిపించారు. అక్షయ్ కుమార్‌ను ఆటాడుకొంటూ షోను జోష్‌తో కొనసాగించారు.

ఫిల్లర్లు.. ఫిల్టర్లు అంటూ అక్షయ్ కుమార్

ఫిల్లర్లు.. ఫిల్టర్లు అంటూ అక్షయ్ కుమార్


అయితే కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు అక్షయ్ కుమార్ సమాధానం చెబుతూ ఫీల్లర్లు అంటూ సమాధానం చెప్పారు. దాంతో కరణ్ జోహర్ ఫిల్లర్లు ఏమిటని ప్రశ్నించగా.. మొబైల్ ఫోన్‌లో ఫోటోల కోసం వాడే ఆప్షన్లు అనగానే.. సమంత నవ్వుల్లో మునిగి వాటిని ఫిల్టర్లు అంటారు అని చెప్పింది. అవును ఫిల్టర్లు.. నేను ఎక్కువగా వాడను. అందుకే నాకు తెలియలేదు అని అక్షయ్ చెప్పారు.

 కరణ్ షోలో విడాకులపై చర్చ

కరణ్ షోలో విడాకులపై చర్చ


అయితే కాఫీ విత్ కరణ్ షోలో విడాకుల గురించి చర్చ వచ్చినట్టు కనిపించింది. బహుశా విడాకులు ఎందుకు తీసుకొన్నారని అడిగి ఉంటారమో.. కానీ సమంత మాత్రం ఫన్‌గా తనదైన శైలిలో సమాధానం చెప్పింది. గతేడాది అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే.

మీరు కే3జీ అనుకొంటే.. కేజీఎఫ్ మాదిరిగా

మీరు కే3జీ అనుకొంటే.. కేజీఎఫ్ మాదిరిగా


కరణ్ జోహర్‌ను మాటలతో కవ్విస్తూ.. పెళ్లిళ్లు పెటాకులు కావడానికి నీవే కారణం. మీరు సినిమాలో జీవితం అంతా కభీ ఖుషీ కభీ ఘమ్ (కే3జీ) మాదిరిగా ఉంటుందని చూపించారు. కానీ లైఫ్ మొత్తం కొట్లాటలతో కేజీఎఫ్ మాదిరిగా ఉంటుంది అని కామెంట్ చేశారు. దాంతో అవునా అన్నట్టు కరణ్ జోహర్ ముఖం పెట్టారు.

సమంత కెరీర్ ఇలా..

సమంత కెరీర్ ఇలా..


సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల KRK మూవీలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించింది. సినిమా ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటించిన శాకుంతలం, యశోదా సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. త్వరలోనే యశోదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇంకా బాలీవుడ్ సినిమాతోపాటు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X