For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల తర్వాత సమంత రిస్క్: ఆ ప్రాపర్టీపై కన్ను.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలిస్తే!

  |

  తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్లిపోతూ ఉంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే యమా ఫోకస్ అవుతూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను సైతం అందుకుంటున్నారు. అలాంటి వారిలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరికొన్ని భాషల్లో కూడా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ముంబైలో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  విడాకుల తర్వాత జెట్ స్పీడ్

  విడాకుల తర్వాత జెట్ స్పీడ్

  టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, గత ఏడాది అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుంచి కెరీర్ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తన పంథాను కూడా మార్చుకుని పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తోంది. దీనికితోడు మరికొన్ని ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతోంది.

  హాట్ షోలో గీత దాటిన మెహ్రీన్: బికినీలో బీభత్సమైన ఫోజులు

  నేషనల్ రేంజ్.. పెరిగిన క్రేజ్

  నేషనల్ రేంజ్.. పెరిగిన క్రేజ్

  దాదాపు దశాబ్దానికి పైగానే సినిమాల్లో సత్తా చాటుతోన్న సమంత.. ఎక్కువగా తెలుగులో మాత్రమే సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా మొత్తం పరిచయమైంది. ఇందులో ఆమె చేసిన టెర్రరిస్టు పాత్రకు భారీ స్పందన వచ్చింది. దీంతో ఆమె క్రేజ్ నేషనల్ రేంజ్‌కు చేరింది.

  బిగ్ ప్రాజెక్టులు.. అవి కంప్లీట్‌

  బిగ్ ప్రాజెక్టులు.. అవి కంప్లీట్‌

  ఇటీవలే సమంత రూత్ ప్రభు.. విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంతో వచ్చింది. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఇక, సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్‌గా అవుతున్నాయి.

  యాంకర్ శ్రీముఖి అందాల జాతర: ఆమెనిలా చూశారంటే చెమటలే

  ఆ రెండు భారీ సినిమాల్లోనూ

  ఆ రెండు భారీ సినిమాల్లోనూ

  ఈ మధ్య కాలంలో సమంత వరుస సినిమాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఇప్పటికే ఆమె 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండతో 'ఖుషి' మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమా కమిట్ అయింది. ఇవి మాత్రమే కాదు.. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్‌లో భాగమైంది.

  బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది

  బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది


  'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌ను సమంత క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె మరో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఇందులో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. దీనితో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఈ స్టార్ హీరోయిన్ డిసైడ్ అయిందని టాక్.

  హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  ముంబైకు షిప్ట్.. ఇల్లు కూడా

  ముంబైకు షిప్ట్.. ఇల్లు కూడా

  కొంత కాలంగా స్టార్ హీరోయిన్ సమంత ఎక్కువగా ముంబైలోనే మకాం ఉంటోంది. ఈ క్రమంలోనే పలు ఆఫర్లను కూడా దక్కించుకుంది. అయితే, ఇక్కడికీ, అక్కడికీ తిరిగేందుకు సమయం, డబ్బు వృథా అవుతుందని భావించిన సామ్.. ముంబైలో ఇల్లు కూడా కొనుగోలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అంటే హైదరాబాద్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోబోతుందని అంటున్నారు.

  ఓ ఇంటిది కాబోతున్న సామ్

  ఓ ఇంటిది కాబోతున్న సామ్

  సమంత ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిందని వస్తున్న వార్తలపై తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆమె ఓ పాత ఇంటినే కొనుగోలు చేసిందట. ఇప్పుడు దీన్ని రీమోడలింగ్ చేయిస్తుందట. మొత్తానికి ఈ ఇంటి కోసం సమంత ఏకంగా రూ. 30 కోట్లు ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

  English summary
  Samantha Ruth Prabhu Full Busy with Tollywood Movies. Now She Bought A 30 Crores House in Mumbai To Focus On Bollywood Market.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X