Samantha: విడాకుల తర్వాత దూసుకుపోతున్న సమంత.. భారీగా పెరుగుతున్న బ్రాండ్ వాల్యూ.. అంతా రివర్స్ లో!
విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆమెకు భర్తతో కలిసి ఉన్నప్పటికంటే ఇప్పుడు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి అని చెప్పవచ్చు. ఆమె బోల్డ్ పాత్రలకు కూడా సై అనడం అలాగే ఆమె చేస్తున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఆమె బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

కోర్టుకు కూడా
ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగచైతన్య సమంత తన విడిపోతున్నాం అని 2021 అక్టోబర్ నెలలో ప్రకటించారు. ఈ విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత చాలామంది సమంత తప్పు ఉందని సమంత కారణంగానే ఈ జంట విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.. చాలా రోజుల పాటు ఈ విషయం మీద ఓపిక పడుతూ వచ్చిన సమంత తన ఓపిక నశించడం తో ఎట్టకేలకు ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకు కూడా వెళ్లారు.

దుష్ప్రచారం
కోర్టు కూడా మీ వ్యక్తిగత విషయాలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టవద్దని అక్షింతలు ఇస్తూనే ఆమె వ్యక్తిగత విషయాల మీద ఎలాంటి దుష్ప్రచారం చేయకూడదు అంటూ మీడియాకు సూచించింది. వివాహం రద్దు అయిన తర్వాత ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. వివాహం రద్దు కావడానికి ముందే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉండగా తమిళంలో నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకుంది.

సోషల్ మీడియా ఖాతాలో
తన వివాహం రద్దు అయిన వెంటనే ఆమె యశోద అనే ఒక సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టింది. ఆమె ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ఫిలిమ్ కూడా ఒప్పుకుంది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజా సమాచారం మేరకు ఈ భామకు బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. ఆమె ఈ మధ్యనే రెండు యాడ్స్ చేశారు. వాటిని కొన్ని గంటల వ్యవధిలోనే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

వెంట పడుతున్నాయి
అయితే సమంత కొత్తగా యాడ్స్ చేస్తుందని చెప్పడం లేదు కానీ విడాకులు జరిగిన తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతుందని అందరూ అనుకున్నారు కానీ ఆమెకు ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలతో పాటు ఈ బ్రాండ్స్ కూడా తమకు ప్రచారం చేయమని వెంట పడుతున్నాయి అయితే దీనికి విడాకులు తీసుకోవడమే కారణం అని చెప్పలేం ఎందుకంటే విడాకులు తీసుకోవడానికి ముందు ఆమె ఫ్యామిలీ వెబ్ సిరీస్ ద్వారా హిందీ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.

యాడ్స్ విషయంలో మాత్రం
దానికి తోడు పుష్ప సినిమాలో ఆమె చేసిన ఊ అంటావా మామా ఉహు అంటావా మామ అనే సాంగ్ కూడా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టేలా చేసింది. ఈ క్రేజ్ దృష్ట్యా ఆమెకు హిందీలో సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక ఆమెకు బ్రాండ్స్ కూడా క్యూ కడుతున్నాయి. ఆమె అన్నిటినీ ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ వివాదం అవుతుంది అనుకున్నా యాడ్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోందని టాక్.


Click it and Unblock the Notifications











