విడాకుల ప్రకటన తర్వాత ఆ ఆశ్రమానికి సమంత.. పూజలు, యాగాలలో బిజీబిజీ!

సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా సరే అది ఒక వార్త అయిపోతుంది. గతంలో కంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఎక్కువైపోయింది. అయితే నాగచైతన్య విడాకుల తర్వాత సమంత ఇప్పుడు వరుసగా తీర్థయాత్రలు చేస్తూ పూజలు, యాగాలలో మునిగిపోవడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే

వెనక్కి లాగలేరు

వెనక్కి లాగలేరు

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు అక్టోబర్ రెండో తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల విశ్లేషణలు రకరకాల వార్తలు వీరి గురించి బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కువమంది సమంతదే తప్పన్నట్లు మాట్లాడుతూ ఉండడంతో ఒకసారి ఇప్పటికే సమంత తన సోషల్ మీడియా ద్వారా తాను ఎలాంటి తప్పు చేయలేదని తను దయచేసి జడ్జి చేయొద్దని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఎన్ని జరిగినా నన్ను వెనక్కి లాగలేరు అన్నట్టు ఆమె కామెంట్ చేసింది.

పరువు నష్టం దావా

పరువు నష్టం దావా

అయినా సరే సమంత గురించి రకరకాల విశ్లేషణలు వార్తలు బయటకు వస్తూ ఉండటంతో ఇక లాభం లేదు అనుకుని ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక డాక్టర్ మీద పరువు నష్టం దావా కూడా వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కూకట్పల్లి కోర్టులో నడుస్తుంది. సోమవారంనాడు వాదనలు కూడా వినడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంటే తను మాత్రం ఈ నెగిటివిటీ నుంచి బయటపడడం కోసం వరుసగా తీర్థయాత్రలు చేస్తోంది. ఆమె వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సామ్రాట్ రెడ్డి అక్కతో

సామ్రాట్ రెడ్డి అక్కతో

నాగచైతన్య విడాకుల వ్యవహారం తర్వాత సమంత బాగా ఇబ్బంది పడుతుంది, ఆమె డిప్రెషన్లోకి సైతం వెళ్లిపోయే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే నటుడు సామ్రాట్ రెడ్డి అక్క సమంత స్నేహితురాలైన శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సమంత ఇప్పుడు తీర్థయాత్ర చేస్తుంది. అందుకే చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఆమె గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ఆలయాలను దర్శించుకుని కొన్ని ఆశ్రమాలను ఆలయాలను కూడా సందర్శించింది.

 చార్ధామ్ యాత్ర

చార్ధామ్ యాత్ర

ఇక తమ స్పెషల్ హెలికాప్టర్ జర్నీ మొదలు గంగా హారతి, యాగాలు, పూజలు వంటి అన్ని విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అలాగే రిషికేశ్ లో మహర్షి మహేష్ యోగి ఆశ్రమాన్ని కూడా సందర్శించిన ఈ బృందం ఆ తర్వాత ఈ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ యాత్ర ముగిసింది అని చెబుతూ చార్ధామ్ యాత్ర గురించి సమంత తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Recommended Video

నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
స్వర్గం లాంటి హిమాలయాల్లో

స్వర్గం లాంటి హిమాలయాల్లో

మహాభారతం చదివినప్పటి నుండి ఈ భూమి మీద స్వర్గం లాంటి హిమాలయాల్లో గడపాలని అనుకున్నాను, ఇప్పటికి నా కల నిజమైంది నా హృదయంలో ఎపుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ ఫోటోలు షేర్ చేసి ఆమె రాసుకోచ్చింది. ఇక శ్యామ్ ఆధ్యాత్మిక యాత్ర లో ఆనంద పరవశంగా ఉండడంతో అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య సమంత మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు కాబట్టి వాడు విడిపోయాక వారి బతుకులను బతకనివ్వాలి అంతేగాని విశ్లేషణలు చేసి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని సమంత అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X