Samantha: ఆటోను వెంటాడిన సమంత.. నడిరోడ్డుపై అలాంటి పని చేస్తూ కెమెరాకు దొరికి..!
సినిమాలు చేసినా చేయకపోయినా సమంత రుత్ ప్రభు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నది. యశోద, ఖుషి సినిమాల తర్వాత పెద్దగా సినిమాలు ఒప్పుకొన్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఏదో విధంగా సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలతో వైరల్ అవుతున్నది. తాజాగా సమంత ఎందుకు ట్రెండింగ్ అవుతున్నదనే వివరాల్లోకి వెళితే..
సమంత అరుదైన వ్యాధి నుంచి కోలుకొని జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉంది. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా విదేశాల్లో విహార యాత్ర చేసి వచ్చింది. అక్కడ షూట్ చేసిన ఫోటోలు, వీడియోలు ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. హాట్ హాట్‌గా దిగిన ఫోటోలు కూడా నెటిజన్లు,అభిమానులు విశేషంగా ఆకట్టుకొన్నాయి.

ఇక సమంత తన ఆరోగ్యం కోసం ఐస్ థెరపీలో భాగంగా బాత్ టబ్‌లో న్యూడ్‌గా ఉన్న ఫోటో మీడియాలో వైరల్ అయింది. అయితే అది సమంతది కాదు.. ఎవరో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు అంటూ వాదనలు వినిపించాయి. అయితే కొందరు కాదని, మరొ కొందరు అవుననే వాదనలతో ఆ వార్త పాతబడిపోయింది.
ఇక తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ అందాల భామ ఓ ఆటోను వెంబడించింది. తన కారు ముందు ఉన్న ఆటోపై తన పోస్టర్ అతికించి ఉండటంతో దానిని కొంతదూరం ఫాలో అయింది. ఆ తర్వాత నడి రోడ్డు మీద కారు పరుగుల పెడుతుండగా.. కెమెరాను తనవైపు తిప్పుకొని ఎక్కిరించి కవ్వించింది. ప్రస్తుతం ఆ వీడియో మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన సిటాడెల్ చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. మరో ప్రాజెక్టు షూటింగు దశలో ఉంది. పలు చిత్రాల దర్శకులు, నిర్మాతలతో కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. త్వరలోనే ఎక్కువ సినిమాలతో బిజీ అయ్యేందుకు తన ప్లాన్‌ను రెడీ చేసుకొంటున్నది.


Click it and Unblock the Notifications











