Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. అదే సమయంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా భారీ ఆఫర్లను ఒడిసి పట్టుకుంటూ హవాను చూపిస్తోంది. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తన బ్రాండ్ వ్యాల్యూను ఉపయోగించుకుని ఎన్నో సంస్థలకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత కాస్మో ఇండియా కవర్ ఫొటోకు ఫోజులిచ్చింది. హాట్ ట్రీట్ ఇస్తూ దిగిన ఈ పిక్‌ను మీరు కూడా చూసేయండి మరి!

అప్పుడలా.. ఇప్పుడిలా చేస్తోంది

అప్పుడలా.. ఇప్పుడిలా చేస్తోంది

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సమంత మంచి గుర్తింపును అందుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఎన్నో విజయాలు కూడా దక్కాయి. దీంతో ఆమె మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్ పెరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత మరింత స్పీడు పెంచేసింది.

సత్తా చాటింది.. రేంజ్ పెరిగింది

సత్తా చాటింది.. రేంజ్ పెరిగింది

స్టార్ హీరోయిన్‌గా చాలా ఏళ్లుగా హవాను చూపిస్తోన్న సమంత.. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర అదిరిపోయింది. దీనితో సమంత తన రేంజ్‌ను జాతీయ స్థాయికి పెంచుకుంది.

భారీ చిత్రాలు... దాదాపుగా పూర్తి

భారీ చిత్రాలు... దాదాపుగా పూర్తి

సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీ షూట్‌లు కంప్లీట్ అయ్యాయి.

యశోదగా మారి.. ఇంగ్లీష్ మూవీ

యశోదగా మారి.. ఇంగ్లీష్ మూవీ

ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. ఈ ఇంటర్నేషనల్ మూవీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతోన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

అందాల విందుతో రచ్చ చేస్తూ

అందాల విందుతో రచ్చ చేస్తూ

సోషల్ మీడియాలో తెలుగు హీరోలెవరికీ లేనంత ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సమంత రూత్ ప్రభు.. తన ఫ్యాన్స్‌కు నిత్యం మజాను పంచేందుకు తెగ శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంది. తద్వారా తరచు వార్తల్లో నిలుస్తోంది. ఫలితంగా సమంత తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

కవర్ ఫొటో కోసం ఎంతో హాట్‌గా

కవర్ ఫొటో కోసం ఎంతో హాట్‌గా

దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుని తన బ్రాండ్ వ్యాల్యూను కూడా భారీగా పెంచుకున్న సమంత.. తాజాగా కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. దీన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు షార్ట్ డ్రెస్ ధరించింది. ఫలితంగా ఆమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన వచ్చి తెగ వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X