Samantha Ruth Prabhu: అతనితో సమంత అర్ధరాత్రి డేట్ నైట్.. పక్కనే మరొకరు.. ఫొటోస్ వైరల్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను సొంతం చేసుకున్న సమంత రూత్ ప్రభు ప్రస్తుతం కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలను మాత్రమే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా ఆమె విభిన్నమైన తరహా ప్రాజెక్టులకు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తోంది. ఇక విడాకుల అనంతరం సమంత తన కెరీర్ ను సరికొత్తగా మార్చుకుంటోంది అనే చెప్పాలి. ఇక రీసెంట్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది. ఒక వ్యక్తితో ఆమె డేట్ నైట్ కు వెళ్ళినట్లుగా క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video


ఏం జరిగిందో ఏమో..
అక్కినేని యువ హీరో నాగచైతన్య తో ఐదేళ్ల ప్రేమ అనంతరం పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా ఫ్యామిలీ లైఫ్ తో బిజీ గా కనిపించింది. ఇక మరొకవైపు తన కెరీర్ విషయంలో కూడా ఆమె ఎప్పుడూ తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ఏం జరిగిందో ఏమో కానీ హఠాత్తుగా నాగచైతన్య నుంచి విడిపోవడంతో అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. వివాదాలతో తన పేరు రాకుండా చూసుకునే సమంత ఆ విషయం తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

స్పెషల్ వెకేషన్స్
ప్రస్తుతం సమంత తన సినీ ప్రయాణాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు సినిమాల్లో మాత్రమే కాకుండా మరొకవైపు పర్సనల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ కోసం తన స్నేహితులతో కలిసి స్పెషల్ వెకేషన్స్ కు కూడా వెళ్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

విడాకుల తరువాత..
సమంత తన స్నేహితులతో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమె ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కొన్ని వారాలపాటు స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక దారిలో కూడా అడుగులు వేసింది. మనసుకు ప్రశాంతత కలిగే ఎన్నో ప్రదేశాలను కూడా చుట్టేసిన సమంత అప్పుడప్పుడు జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన కొటేషన్స్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది.

అలాంటి స్నేహితులు
ఇక షూటింగ్స్ అనంతరం ఏమాత్రం బ్రేక్ దొరికినా కూడా సమంత ఎక్కువగా తన స్నేహితులతో కలిసి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక ఆమె స్నేహితులల్లో ఎక్కువగా ఏమి వెండితెర స్టార్ సెలబ్రిటీలు ఏమి ఉండరు. వెండితెర వెనుక పనిచేసే వారు అలాగే సింగర్స్ ఆమెకు మంచి మిత్రులు గా కొనసాగుతున్నారు. అందులో ప్రముఖ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ ఉన్నారు.

డేట్ నైట్ సెల్ఫీ వైరల్
రీసెంట్ గా మరొకసారి సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో డేట్ నైట్ కు వెళ్ళినట్లుగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. అంతేకాకుండా ప్రీతమ్ తో పాటు మేకప్ ఆర్టిస్ట్ సాధన కూడా వారితోనే ఉంది. ఇక వీరు కారులో వెళుతుండగా ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆ ఫోటోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. స్నేహితులతో హ్యాపీగా డేట్ నెట్ లో పాల్గొన్నట్లు గా తెలియజేసింది.

సినిమాల విషయానికి వస్తే..
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లిస్టులో అయితే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండ తో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే యశోద అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం అనే మైథలాజికల్ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











