విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ డిసిషన్.. ఆ జ్ఞాపకాలలన్ని మళ్ళీ గుర్తు రాకుండా.. డిలీట్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన సమంత నాగచైతన్య విడాకుల విషయంపై రోజుకొక వార్త వైరల్ గా మారుతోంది. గతంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరికొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో ఎవరికి సంబంధించిన వార్తలు అంతగా వైరల్ అవ్వలేదు. కానీ ఈ సారి మాత్రం మాజీ కపుల్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా అప్ సెట్ అయ్యారు. మొత్తానికి ఇద్దరు కూడా వారి ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్లు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సమంత విడాకుల తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తు రాకుండా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తరువాత..

పెళ్లి తరువాత..

సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఏ మాయ చేశావే సినిమాతో మొదటి సారి కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట పెద్దల నిర్ణయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. గోవాలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒకటైన ఈ జంటకు చాలా మంది సెలబ్రెటీలు అభిమానులు ఫిదా అయ్యారు. వారి పెళ్లికి సంబంధించిన మూమెంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి.

అబద్ధం అనుకున్న సమయానికి..

అబద్ధం అనుకున్న సమయానికి..

మొత్తానికి నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా చాలాసార్లు అభిమానుల నుంచి పలువురు సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయితే హఠాత్తుగా వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందే వేరే వివాహ బంధం పై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే అవన్నీ కూడా అబద్ధం అని అనుకున్న సమయంలోనే ఇద్దరు కపుల్స్ కూడా పాజిటివ్ గానే విడిపోతున్నట్లు వివరణ ఇచ్చారు.

గతంలో నాగచైతన్యతో ఫొటోలు..

గతంలో నాగచైతన్యతో ఫొటోలు..

అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నోరకాల కొటేషన్లను కూడా షేర్ చేసుకుంటోంది. అయితే గతంలో సమంత నాగచైతన్య కు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. చైతు తో ఆమె సెలబ్రేట్ చేసుకునే ఎన్నో పార్టీలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి.

Recommended Video

నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
పాత జ్ఞాపకాలను కనిపించకుండా

పాత జ్ఞాపకాలను కనిపించకుండా

అయితే విడాకుల తర్వాత సమంతా దాదాపు 85 ఫోటోలను అలాగే మిగతా వీడియోలను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ భర్తతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫోటోలు అందరికీ కూడా కనిపించకుండా చేసింది. ప్రస్తుతం ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. పాత జ్ఞాపకాలను కనిపించకుండా చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సమంత తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఇక ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను ఫినిష్ చేసిన విషయం తెలిసిందే. అలాగే త్వరలో మరొక లేడి ఓరియెంటెడ్ సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X