Don't Miss!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Koffee With Karan: సమంత విడాకుల విషయం.. కరణ్ జోహార్ కు ఎంత లాభమంటే?
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఎక్కువగా పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు ఆఫర్లు అందుకున్న సమంత ప్రస్తుతం మరొక బిగ్ బడ్జెట్ సినిమాలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో ఆమె విడాకుల విషయంతో నిర్మాత కరణ్ జోహార్ కు మాత్రం మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచి స్టార్ ఇమేజ్
సమంతకు
సౌత్
ఇండస్ట్రీలో
ఎలాంటి
క్రేజ్
ఉందో
ప్రత్యేకంగా
చెప్పనవసరం
లేదు.
కొన్నిసార్లు
ఆమె
ద్వారా
కూడా
సినిమా
ధియేటర్లకు
వచ్చే
ఆడియన్స్
అయితే
చాలా
ఎక్కువమంది
ఉంటారు
అని
చెప్పవచ్చు.
మంచి
కంటెంట్
వస్తే
సమంత
సినిమాలకు
భారీ
స్థాయిలో
కలెక్షన్స్
వస్తాయని
'ఓ
బేబీ'
సినిమాతో
రుజువు
అయింది.
అలాగే
ఇంతకుముందు
మరికొన్ని
సినిమాలతో
కూడా
ఆమె
తన
టాలెంట్
ఏమిటో
నిరూపించుకుంది.

కారణం ఏమిటి?
అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఐదేళ్ల పెళ్లి బంధం అనంతరం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరు విడిపోయిన తర్వాత అభిమానులు మాత్రం చాలా అప్సెట్ అయ్యారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో బెస్ట్ స్టార్ కపుల్స్ గా మంచి క్రేజ్ అందుకున్న సమంత నాగచైతన్య ఇద్దరు అలా విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అనేది ఎవరికి అంతు చిక్కలేదు. అయితే ఆ విషయంలోనే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో కూడా..
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ తో వారు చాలా బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఇద్దరూ కూడా సినిమాల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకోవడానికి సమంత ప్రయత్నాలు చేస్తుంది. పుష్ప సినిమా ఐటెం సాంగ్ ద్వారా అక్కడ మీకు మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

విడాకులతో మంచి క్రేజ్
అయితే ఇటీవల కరణ్ జోహార్ సమంత విడాకుల విషయంపై ప్రశ్నలు వేయడంతో కాఫీ విత్ కరణ్ షో మంచి క్రేజ్ అందుకుంది. ఎందుకంటే అప్పటివరకు సమంత ఎప్పుడు కూడా తన విడాకుల విషయంపై పెద్దగా స్పందించింది లేదు. కానీ మొదటిసారి కరణ్ షోలో ఆమె వివరణ ఇవ్వడంతో ఒక్కసారిగా టాక్ షోకు భారీ స్థాయిలో వ్యూవ్స్ అయితే వచ్చాయి. ఇటీవల కాలంలో కాఫీ విత్ కరణ్ షోకు అలాంటి స్థాయిలో అయితే దక్కనట్లుగా తెలుస్తోంది.

కోట్లల్లోనే..
ఒక విధంగా కరణ్ జోహార్ తన టాక్ షోకు సమంత విడాకుల విషయాన్నీ బాగానే వాడుకున్నట్లు అర్థమవుతుంది. ఆ విడాకుల విషయమే కోట్లల్లో వ్యూవ్స్ అయితే అందిస్తున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ సమంతను ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా ఒక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ సినిమా కరణ్ జోహార్ హోం ప్రొడక్షన్ ధర్మ ప్రోడక్షన్ లోనే తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి సమంత అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.