Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Samantha, నాగచైతన్య విడాకులకు కారణం అతడే.. ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు.. కంగన రనౌత్ ఫైర్
దంపతులుగా తాము విడిపోతున్నామనే నాగచైతన్య, సమంత రుత్ ప్రభు విడాకులకు సంబంధించిన అధికార ప్రకటన రావడంతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇప్పటి వరకు అన్యోన్యంగా ఉంటూ కనిపించిన దంపతులు ఒక్కసారిగా విడిపోవడం అందర్నీ షాక్ గురిచేసింది. అయితే వారిద్దరూ విడిపోకూడదని అందరూ కోరుకొన్నారు. అయితే వారిద్దరూ విడిపోవడం అనివార్యమైంది. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడం వెనుక అసలు కారణం అమీర్ ఖాన్ అంటూ కంగన రనౌత్ ఘాటైన విమర్శలు చేశారు. కంగన తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పోస్టు పెట్టి ఎలాంటి విమర్శలు చేశారంటే..
Chay Sam Divorce: హాట్ హాట్‌గా సమంత.. ఆ వీడియోలో మరీ పచ్చిగా.. ఇది కూడా విడాకులకు కారణమేనా!

మగాడి వల్లే విడాకులు
వైవాహిక జీవితం నుంచి దంపతులు విడిపోయారంటే అందుకు ప్రధాన కారణం మగాడే అయి ఉంటాడు. ఇలాంటి స్టేట్‌మెంట్స్ చాలా జడ్డిమెంటల్‌గా, సంప్రదాయంగా అనిపించవచ్చు. కానీ ఆడ, మగను దేవుడు ప్రత్యేకమైన సహజమైన, పరిస్థితుల మధ్య పుట్టించాడు. కానీ మగాడే ఆడదాన్ని వేటాడుతుంటాడనేది సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయింది. దుస్తులను మార్చినట్టు ఆడవాళ్లను మార్చే పద్దతిని మానుకోవాలి. ఆ తర్వాత మేము మంచి స్నేహితులం అని కలరింగ్ ఇచ్చే పద్దతి మానుకోవాలి. వందలో ఒక మహిళ తప్పని తేలుతుంది అని కంగన రనౌత్ అన్నారు.

చైతన్య నిర్ణయం సిగ్గు చేటు
ఇక నాగచైతన్యపై కూడా కంగన రనౌత్ మండిపడింది. ఆడవాళ్లను తప్పుడు కోణంలో చూసే వ్యక్తుల్లో చైతు కూడా ఒకరు. మీడియా, ఫ్యాన్స్‌ను ఆధారంగా చేసుకొని ఆడవాళ్లపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం సిగ్గుచేటు. కొందరి అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని మహిళలపై తప్పుడు ఒపీనియన్స్ ఏర్పరుచుకొంటారు. సినీ పరిశ్రమలో గతంలో మునుపెన్నడూ లేని విధంగా విడాకుల సంస్కృతి పెరిగిపోతున్నది అంటూ కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు.

అమీర్ ఖాన్ వల్లే సమంతకు విడాకులు
నాగచైతన్యపై కంగన మండిపడుతూ... అమీర్ ఖాన్‌తో కలిసి లాలా సింగ్ చద్దా చిత్రంలో నటించాడు. అప్పటి నుంచే సమంతతో వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకొన్నారు. అమీర్ ఖాన్ వల్లే ప్రభావితం చెంది ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకొన్నారు అని కంగన ఆరోపించింది.

అమీర్ ఖాన్‌ను కలిసిన తర్వాతే అంటూ
నాలుగేళ్ల వైవాహిక జీవితాన్ని, దశాబ్దకాలంపైగా బంధానికి గుడ్‌బై చెబుతూ నాగచైతన్య ఊహించని విధంగా షాకింగ్ కలిగించే అంశం. అందుకు కారణం బాలీవుడ్‌లో డైవోర్స్ ఎక్ట్స్‌పర్ట్ అయిన సూపర్‌స్టార్‌ను కలిసిన తర్వాతే అలా ప్రభావితం చెందారు అని అంటూ అమీర్‌పై కంగన ఘాటుగా స్పందించారు. గతంలో ఇద్దరు భార్యలకు అమీర్ ఖాన్ విడాకులు ఇవ్వడం తెలిసిందే.

ఎంతో మంది జీవితాలను అమీర్ ఖాన్ నాశనం అంటూ
అమీర్ ఖాన్ పేపర్లో వైవాహిక సమస్యలకు సమాధానం చెప్పే అంటీ (అగోని ఆంటీ) లాంటి వాడు. అందరికి ఉచిత సలహాలు ఇస్తూ ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను నాశనం చేశాడు. చాలా మంది అమ్మాయిల జీవితాలను, పిల్లల జీవితాలను నాశనం చేశాడు. ఇప్పుడు అగోని ఆంట్ పాత్రను పోషిస్తూ మరో ఇద్దరిని విడదీశాడు. వారి విడాకుల పర్వంగా స్మూత్‌గా ముందుకు తీసుకెళ్లాడు. అదే విషయాన్ని ఇటీవల బహిరంగంగా కూడా మాట్లాడాడు అని కంగన రనౌత్ అన్నారు.