Don't Miss!
- News
హైదరాబాద్: దళిత నేత ఇంట్లో యూపీ డిప్యూటీ సీఎం భోజనం, హారతులు పట్టారు
- Finance
Medicines Prices: బీపీ, షుగర్ రోగులకు చేదు వార్త.. పెరిగిన మందుల ధరలు.. ఎక్కడంటే..
- Sports
ఆ వార్త తెలిసి మా అత్తయ్య తెగ ఉప్పొంగిపోయింది : బుమ్రా భార్య సంజనా గణేషన్
- Technology
భారత విద్యార్థులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించిన Samsung!
- Automobiles
టొయోట నుంచి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' వచ్చేసింది: బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?
- Lifestyle
Heartburn and Acid Reflux: హార్ట్ బర్న్ మరియు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే అని పొరబడకండి, ఇదే తేడా..
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆ బాధ మరిచిపోవడానికి ఆర్నెళ్లు పట్టింది.. సమంత ఎమోషనల్
గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ప్రస్తుతం మాత్రం సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అడుగులు వేస్తూ తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి ఆమె విడిపోయిన అనంతరం సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ సందడి చేసే సమంత ఇటీవల అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకు ఎమోషనల్ అవుతూ సమాధానం చెప్పింది. ఒక తీవ్రమైన బాధను ఆమె దాదాపు ఆరు నెలలు అనుభవించాల్సి వచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..

సరికొత్త ట్రెండ్
సింపుల్ క్యూట్ హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు మొదటి సినిమాతోనే కుర్రకారును ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక కాలం మారుతున్న కొద్దీ సమంత గ్లామర్ విషయంలో కూడా ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఒక విధంగా ఆమె తన స్టైలింగ్ విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ ను ఫాలో అయ్యిందనే చెప్పాలి.

కొత్తగా అందంగా కనిపించాలని..
సమంత ఎలాంటి పాత్రలో కనిపించిన కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంది. దర్శకుడు ఎలా చూపించినా కూడా ఆమె తన స్టైలింగ్ విధానంలో కూడా విభిన్నమైన ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అలాగే మిగతా స్టైలింగ్ విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. చెవి కమ్మల దగ్గరనుంచి ముక్కు పుడక వరకు సమంత కొత్తగా కనిపించేందుకు తనను తాను ఎంతగానో మార్చుకుంటుంది.

గ్లామరస్ ఫొటోలతో..
ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలతో కూడా కనిపించే సమంత ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా ఆమె చాలా స్వీట్ గా సమాధానం చెబుతూ ఉంటారు.

ఆరు నెలలపాటు బాధలో..
ఇక
రీసెంట్
గా
ఒక
ప్రశ్నకు
సమాధానం
చెప్పిన
సమంత
ఒక
నొప్పిని
దాదాపు
ఆరు
నెలల
పాటు
భరించాల్సి
వచ్చిందట.
ప్రస్తుతం
ఆమె
చెవికి
దాదాపు
ఐదు
కుట్లు
ఉన్నాయి.
విభిన్నమైన
స్టైలింగ్
కోసం
సమంత
చెవిపోగులు
కుట్టించుకోవాల్సి
వచ్చిందట.
అయితే
చెవి
మధ్య
భాగంలో
కూడా
సమంత
ఒక
చెవి
పోగు
ఉంది.
అదే
తనకు
ఎక్కువగా
నొప్పిని
కలిగించినట్లు
చెప్పుకొచ్చింది.
|
ఎమోషనల్ అయిన సమంత
రీసెంట్ గా సోషల్ మీడియా చిట్ చాట్ లో ఆ చెవి పోగులు ఎందుకు కుట్టించుకున్నానో నాకు తెలియదు అంటూ.. ఆ నొప్పి తగ్గడానికి ఆరు నెలల టైమ్ పెట్టినట్లు సమంత ఎమోషనల్ అవుతూ తెలియజేసింది. ఇక ప్రస్తుతం సమంత యశోద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె శాకుంతలం షూటింగ్ ను ఫినిష్ చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నసించిన 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమా విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఆమె అవకశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది.