Samantha Ruth Prabhu : నాగ చైతన్యతో బ్రేకప్.. ఎంగేజ్మెంట్ రింగును సమంత ఏం చేసిందో తెలుసా?

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్రాలతోనే సమంత ఏ రేంజ్ పాపులారిటీని దక్కించుకుందో తెలిసిందే. తన హార్డ్ వర్క్ తో దక్షిణాదిలో సమంత చెరగని ముద్రవేసుకుంది. అక్కినేని నటవారసుడు నాగచైతన్య సరసన 'ఏమాయ చేసావే' చిత్రంతో మొదలైన ఆమె కెరీర్ ప్రస్తుతం స్టార్ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో ఈ బ్యూటీ నటించిన చిత్రాలు దాదాపు మంచి హిట్ అందుకోవడం విశేషం. కెరీర్ పరంగా సమంత రూత్ ప్రభు మంచి సక్సెస్ ను సాధించింది.

అయితే, సమంత రూత్ ప్రభు తన పర్సనల్ లైఫ్ లో కాస్తా డిస్టబ్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు అవ్వగా.. సమంత ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే. 2021లో సడెన్ గా సమంత - నాగచైతన్య డివోర్స్ ప్రకటించి ఇండస్ట్రీనే ఉలిక్కి పడేలా చేశారు. ఇప్పటి వరకు వారిద్దరూ విడిపోయే అంత సమస్య ఏంటీ, కారణం ఏంటనేది మాత్రం మూడో కంటికి తెలియదు. వారు కూడా ప్రస్తుతం తమ తమ జీవితాల్లో బిజీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. ఎవరి కెరీర్ లో వారు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ అదరగొడుతున్నారు.

Samantha Ruth Prabhu Engagement Ring Turn into Pendant after Breakup With Naga Chaitanya Actress Did this

కాగా, తాజాగా సమంత రూత్ ప్రభు ఎంగేజ్ మెంట్ రింగ్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. సమంత- చైతూ ఎంగేజ్ మెంట్ సమయంలో ఒకరికొకరు రింగ్ లు మార్చుకున్నారు. అయితే ఆ ఎంగేజ్ మెంట్ రింగ్ ను ఇంకా సమంత భద్రంగా ఉందని తెలుస్తోంది. అందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా సమంత బాలీవుడ్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తన మెడలో ఉన్న ఓ లాకెట్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ లాకెటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ కు దారి తీసింది.

సమంత - చైతూ ఎంగేజ్ మెంట్ రింగ్, సమంత మెడలో ఉన్న లాకెట్ సేమ్ ఒకేలా ఉన్నాయి. ఆ రింగ్ ను మెడలో వేసుకునేందుకు తగినట్టుగా సామ్ రిడిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. అయితే సమంతకు నాగచైతన్యతో విడాకులు అయినప్పటికీ ఆ రింగ్ ను లాకెట్ రూపంలోకి మార్చి మెడలో వేసుకోవడంతో ఆసక్తికరంగా మారింది. సమంత ఇంకా నాగచైతన్య మెమోరీస్ లోనే జీవిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక నాగచైతన్య ఇప్పటికే తన సెకండ్ లైఫ్ ను ప్రారంభించినా... సమంత మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది.

Take a Poll

నాగచైతన్య గతేడాది చివర్లో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా ప్రస్తుతం హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత మాత్రం తన కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్ లో ఉందని తరుచూగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ పుకార్లను అటు సమంత కూడా ఖండించకపోవడం గమనార్హం. చివరిగా సమంత, బాలీవుడ్ స్టార్ వరుణ్ దావన్ తో కలిసి యాక్షన్ సిరీస్ 'సిటాడెల్ : హనీబన్నీ'లో నటించింది. ఈ సిరీస్ మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక నాగచైతన్య 'తండేల్'తో బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X