Samantha Ruth Prabhu Exclusive interview యశోద ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తుంది.. యాక్షన్ సీన్లు సూపర్బ్..
యశోద సినిమా కథ విన్నప్పుడు షాక్ తిన్నాను. కథ విన్నంత సేపు రొమాలు నిక్కబొడిచాయి. వాస్తవ సంఘటనల మీద సినిమా రూపొందింది. కథ ఒకే చేయడానికి కొంత సమయం పడుతున్నది. హరి, హరీష్ కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను. నేను ఎప్పుడు ఒక జోనర్‌ను రిపీట్ చేయను. కథ విన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో.. ఆడియెన్స్ కూడా సినిమా చూసినప్పుడు అలాగే షాక్ అవుతారు అని సమంత అన్నారు. సమంత ఇంకా మాట్లాడుతూ..

100 శాతం ఎఫర్ట్ పెట్టాం
యశోద హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రిలీజ్ అవుతున్నది. నాకు ఈ సినిమాపై ఎక్కుడ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే కొంత టెన్షన్‌గా ఉంది. ఒక మంచి సినిమా తీశాం. ప్రేక్షకులకు రీచ్ కావాలనే టెన్షన్ ఉంది. మేము మాత్రం 100 శాతం ఎఫర్ట్ పెట్టాం అని సమంత అన్నారు.

ఫైట్స్ చాలా ఎంజాయ్ చేశాను..
యశోద సినిమా కోసం నేను డూప్ ఉపయోగించకుండా నేను ఫైట్స్, యాక్షన్ సీన్లు చేశారు. ఫైట్స్ చేసేటప్పుడు నేను ఇంత ఎంజాయ్ చేస్తానని అనుకోలేదు. ఫైట్స్ చేసేటప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి. ముఖం మీద దెబ్బ తగలినప్పుడు 30 నిమిషాలు దిమ్మతిరిగిపోయింది. అయితే నేను చాలా టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌తో పనిచేశాను. నేను బాగా చేశానని అనుకొంటున్నాను. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి అని సమంత అన్నారు.

మణిశర్మ బీజీఎం బాగుంటుంది.
యశోదలో యాక్షన్ సీన్లు చాలా బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. థియేటర్‌లో చూస్తే అదిరిపోతుంది. మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నేను థియేటర్‌లో చూశాను. సినిమా అదిరిపోయింది. నేను థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తాను. వీలైతే నేను ఈ సినిమా కూడా ప్రేక్షకుల మధ్య చూడాలని ఉంది అని సమంత అన్నారు.

యశోద ఒక డిఫరెంట్ వరల్డ్
యశోద మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంది. తాను బతికిన ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఒక బొమ్మరిల్లు లాంటి జీవితంలో ఉంటుంది. కథ విన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ సుకుమార్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు.. ఒక ప్రపంచాన్ని సృష్టించింది. సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నేను థ్రిల్‌గా ఫీలయ్యాను. మణిశర్మ మ్యూజిక్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అంతా ఫర్‌ఫెక్షన్ ఉండటం వల్లే మాకు టెన్షన్ పెరిగింది అని సమంత చెప్పారు.

టాప్ యాక్టర్స్‌తో నటించా
యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆమె ఎక్స్రార్డినరీగా చేసింది. నాకు ఇష్టమైన రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఉన్నాను. నాకు ఈ సినిమాలో లేడీస్ గ్యాంగ్ ఉంది. కొత్త స్టయిల్ యాక్టింగ్ ఉంటుంది. మధురిమ, దివ్య శ్రీపాద, కల్పిక, ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో నటించారు. వారందరితో నటించడం చాలా హ్యాపీగా ఉంది అని సమంత తెలిపారు.


Click it and Unblock the Notifications











