Samantha కు తీవ్ర అస్వస్థత.. అసలేం జరిగిందంటే అని క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

దక్షిణాది సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ పరంగా, బ్రాండ్ అంబాసిడర్‌గా రాణిస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఆదివారం సమంత కడపలో పర్యటించిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో చేరినట్టు వార్తలు వచ్చాయి. దాంతో సినీ వర్గాలు, అభిమానులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత


వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకొన్న ఒడిదుడుకుల నుంచి తేరుకొన్న సమంత.. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత ఆమె కెరీర్ జాతీయ స్థాయిలో ఊపందుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. భారీ ప్రాజెక్టులకు ఒకే చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కడపలో పర్యటించిన సమంత

కడపలో పర్యటించిన సమంత

అయితే ఓ ప్రైవేట్ వస్త్ర దుకాణం ప్రారంభంలో పాల్గొనేందుకు సమంత కడప పట్టణంలో పర్యటించారు. ఆమె రాకతో కడప కిటకిటలాడింది. ఆమెను మొబైల్‌ ఫోన్‌లో బంధించడానికి యువత పోటీపడింది. వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేరారు అనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

అనారోగ్యానికి గురైన సమంత

అనారోగ్యానికి గురైన సమంత

సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడప నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్న ఆమె కొద్ది గంట్లలోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. అయితే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో చేరనున్నారనే వార్తలు హడావిడి చేశాయి. దాంతో ఫ్యాన్స్ కంగారుపడిపోవడంతో ఆమె పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సమంత మేనేజర్ చెప్పిందేమిటంటే..

సమంత మేనేజర్ చెప్పిందేమిటంటే..

అయితే సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్ మహేంద్ర క్లారిటీ ఇచ్చారు. సమంత ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. దగ్గు, స్వల్ప జ్వరంతో బాధపడుతున్న సమంత ఏఐజీ హాస్పిటల్‌లో వైద్య, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తన నివాసంలో సమంత విశ్రాంతి తీసుకొంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దు అంటూ మహేంద్ర ప్రకటన విడుదల చేశారు.

Recommended Video

RGV Goes Gaga Over Pushpa | Allu Arjun Believed In Guts || Filmibeat Telugu
సమంత సినిమా కెరీర్ ఇలా..

సమంత సినిమా కెరీర్ ఇలా..


హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించే న్యూ ఏజ్ థ్రిల్లర్‌ చిత్రం యశోదాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు ఇటీవల ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, దర్శకుడు గుణశేఖర్ సొంత ప్రాజెక్ట్ శాకుంతలం చిత్రంలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. తొలిసారి సమంత ఓ పిరియాడిక్ ఫిలింలో నటిస్తున్నది. అది కాకుండా తమిళంలో విఘ్నేష్ శివన్ నిర్మించే కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X