సమంత రూత్ ప్రభు ఫిటెస్ సీక్రెట్.. సామ్ రోజూ ఏం తింటుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దశాబ్దానికి పైగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలతో అలరిస్తోంది. మరోవైపు సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించి ఎప్పికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల సమంత తన ఫిట్ నెస్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సమంత రూత్ ప్రభు డైట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రతి రోజూ జిమ్ లో..
సమంత రూత్ ప్రభు చిన్న హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలుత నాగ చైతన్య సరసన ఏమాయ చేసావే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2010లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ యాక్టివ్ గా ఉంటోంది. స్టార్ హీరోలతో నటించి మెప్పిన సంగతి విదితమే. అయితే సమంత అటు సినిమాలతోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో ప్రతి రోజూ యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ రోటీన్ గురించి కూడా పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా తన ఫిట్ నెస్ గురించి చెప్పే వీడియోలను షేర్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది. ప్రతిరోజూ జిమ్ లో తప్పనిసరిగా గంట నుంచి 2 గంటల సమయం గడుపుతుంది.

స్పెషల్ డైట్..
జిమ్ లో సమంత రూత్ ప్రభు అన్ని రకాల వెయిట్ లిఫ్టింగ్, ఎక్సర్ సైజ్ లు, స్ట్రెచ్చింగ్, ఏబీఎస్ వర్కౌట్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత రూత్ ప్రభు జిమ్ లో వర్కౌట్స్ చేయడమే కాకుండా, ప్రాపర్ ఫూడ్ డైట్ కూడా ఫాలో అవుతుండటం ఆమె ఫిటెనెస్ కు సీక్రెట్ అని తెలుస్తోంది.
ముఖ్యంగా సామ్ యాంటీ ఇన్ ఫ్లమెంటరీ డైట్ ను ఫాలో అవుతుందంట. ఇందులో కేవలం ఆకు కూరలు, క్యాబేజీ లాంటి కూరగాయాలు, వాటికి తోడు పసుపు, మరిన్ని హెల్తీ ఫ్యాట్ కలిగిన పదార్థాలతో చేసిన వంటకాలను తింటుందంట. కొద్ది కాలంగా ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా, వేరే వంటకాలను రుచి చూడకుండా ఒకే స్టైల్ ను పాలో అవుతందని తెలుస్తోంది.
బాలీవుడ్ కు దగ్గరగా..
సామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత తెలుగులో చాలా వరకు సినిమాలు తగ్గించింది. అందుకు కారణం ఆమె ఆరోగ్యం కూడా బాగా లేకపోవడం, మరోవైపు హిందీలో అవకాశాలు వస్తుండటంతో టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ల్లో తక్కువగా మెరుస్తోంది. చివరిగా పుష్ప : ది రైజ్ చిత్రంలో ఊ అంటావా మావా స్పెషల్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఖుషి సినిమాతో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా శుభం అనే సినిమాకు ప్రొడ్యూస్ చేసి మంచి సక్సెస్ ను అందుకుంది.


Click it and Unblock the Notifications











