Top Heroines: ఆ స్టార్‌ని వెనక్కి నెట్టిన సమంత.. రష్మికకి జనం షాక్, టాప్ 10లో ఎవరెవరంటే?
ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు . కానీ కొందరు మాత్రం జనం గుండెల్లో నిలిచిపోతారు. కొన్ని తరాలు చెప్పుకునేలా వారి పేరు నిలిచే ఉంటుంది. ఈ కోవలోకే వస్తారు సమంత రూత్ ప్రభు. దాదాపు 15 ఏళ్లుగా మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో కీలకపాత్ర పోషిస్తూ.. భారతదేశంలోని టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా, ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. తాజాగా సమంత మరో అరుదైన ఘనతను సాధించారు.
చెన్నైకి చెందిన సమంత రూత్ ప్రభు.. ఆర్ధిక సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువును కొనసాగించడానికి పార్ట్ టైమ్ జాబ్ కూడా చేశారు. కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ చేసి తన పాకెట్ మనీ సంపాదించారు. కష్టపడి చదువు పూర్తి చేసిన సమంత సినీరంగం వైపు అడుగులు వేశారు. 2010లో విన్నైతాండి వరువాయా అనే తమిళ చిత్రంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన సామ్.. తన రెండో సినిమా ఏమాయ చేశావేతో అందరినీ మాయ చేసి టాప్ హీరోయిన్‌గా జెండా పాతింది. నాటి నుంచి తెలుగు , తమిళ చిత్రాలలో ఏకధాటిగా నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా సింహసనాన్ని అధిష్టించింది.

కోటి రూపాయల పారితోషికంతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలతో ఆర్ధిక ఇబ్బందుల నుంచి సంపన్నురాలిగా మారారు. ఏమాయ చేశావే చిత్రంలో తన సహనటుడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు సమంత. నాలుగేళ్లు తిరిగేసరికి అనూహ్య పరిణామాల మధ్య ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ బాధ నుంచి కోలుకునేలోగా మయోసైటిస్ బారినపడి చికిత్స తీసుకున్నారు సమంత. ఆధ్యాత్మిక బాటపట్టి మానసికంగా సాంత్వన పొందుతున్న ఆమె సినిమాలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు.
గతంలో మాదిరిగా ఎడాపెడా సినిమాలు చేయకుండా సెలెక్టీవ్‌గానే స్టోరీలు ఎంచుకుంటున్నారు. గతేడాది సిటాడెల్ : హనీ బన్నీ అనే స్పై థీమ్ వెబ్ సిరీస్‌లో నటించి గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు సమంత. ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత సామ్ తెలుగులో చేస్తోన్న మొదటి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న రక్త్ బ్రహ్మండ్ : ది బ్లడీ కింగ్‌డమ్ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నారు.
గతంలో మాదిరి సినిమాలు తీయకున్నా సమంత స్టార్ డమ్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. అప్పటికీ , ఇప్పటికీ అదే క్రేజుని ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత అరుదైన ఘనతను అందుకున్నారు. ఫిబ్రవరి నెల వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సమంత టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆమె తర్వాత అలియా భట్, దీపిక పదుకొనె, సాయిపల్లవి, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న, త్రిష , నయనతార, శ్రీలీల, అనుష్క శెట్టి నిలిచారు. నిన్న మొన్నటి వరకు ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన రష్మిక.. కనీసం టాప్ 5లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











