ఆయనే నాకు ఫుల్ సపోర్ట్.. స్టేజ్‌పైనే సమంత ఎమోషనల్

ప్రముఖ నిర్మాణ సంస్థలు డీ2ఆర్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ బ్యానర్‌పై ది రూసో బ్రదర్స్, రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న చిత్రం సిటాడెల్ హానీ బన్నీ. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత రుత్ ప్రభు, బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

సిటాడెల్ సినిమా హాలీవుడ్‌లో రూపొందిన స్పై థ్రిల్లర్. ఇంగ్లీష్ వెర్షన్ ప్రియాంక చోప్రా జోనస్ నటించారు. ఇప్పటికే ఈ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే ఈ సీరిస్‌ను ఇండియన్ వెర్షన్‌కు, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించడానికి ప్రయత్నం చేయడంతో అనుకొన్న సమయం కంటే ఎక్కువగానే ఆలస్యమైంది. చివరి సినిమా డేట్‌ను ప్రకటించిన ఈ ట్రైలర్ ఆవిష్కరణ సబలో సమంత మాట్లాడుతూ..

Samantha Ruth Prabhu gets emotional about Varun Dhawan at Citadel Event

సిటాడెల్ నిర్మాణంలో మా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. రాజ్ అండ్ డీకే లాంటి సినీ దర్శకుల విజన్, మేకింగ్ చూసిన తర్వాత.. ప్రతీ ఒక్కరు కూడా ఇలాంటి స్పై యూనివర్స్‌లో భాగం కావాలని కోరుకొంటారు. ఈ ప్రాజెక్టుతో సుదీర్ఘమైన జర్నీ కొనసాగింది. ఈ సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం. ఈ సినిమా తప్పకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు.

ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇండియన్ వెర్షన్‌లో చేయాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ అయ్యాను. యాక్షన్‌తో కూడిన స్పై సిరీస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే స్పై సిరీస్ చేయడం గొప్ప అనుభూతి. ప్రియాంక, ఇంకా హాలీవుడ్‌ నటులు చేసిన పాత్రలను నేను, వరుణ్ ధావన్ చేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు.

Samantha Ruth Prabhu gets emotional about Varun Dhawan at Citadel Event

సిటాడెల్ హానీ బన్నీ సినిమాలో హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. హీరో రోల్ కూడా బ్యాలెన్స్‌గా ఉంటుంది. దర్శకుడు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. నా పాత్రకు కొంత వెయిట్ ఉన్నప్పటికీ. .నాకు ఫుల్ సపోర్టుగా వరుణ్ ధావన్ ఉంటాడు. అదే నా పాత్రకు బలంగా మారింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే విషయంపై ఎక్సైటింగ్‌గా ఉంది అని తెలిపారు.

సిటాడెల్ సిరీస్ నాకు వృత్తిపరంగాను, వ్యక్తిగతంగాను పూర్తిగా సంతృప్తినిచ్చింది. నా కెరీర్లోనే చాలా ముఖ్యమైన పాత్రగా నిలిచిపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్త్రీమింగ్ అయ్యే ఈ సీరీస్‌ను ప్రేక్షకులు 150 దేశాలకుపైగా చూసి ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. నవంబర్ 7వ తేదీ కోసం వేచి చూస్తున్నను అని సమంత అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X