సమంతపై మనసు పడ్డ యువ హీరో.. అప్పటి నుంచే అంటూ సామ్‌తో ఓపెన్‌గానే!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వ్యక్తిగత, ప్రొఫెషనల్ సమస్యలను అధిగమిస్తూ బాలీవుడ్‌లో కెరీర్ సెటిల్ చేసుకొనేందుకు సిద్దమవుతున్నది. ఇప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 ద్వారా తన ప్రతిభను రుజువు చేసుకొన్నారు. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ జోనర్‌లో సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ ద్వారా మరోసారి ప్యాన్ ఇండియా ఆడియెన్స్‌కు చేరవయ్యేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల సమంతపై ఓ యువ హీరో ఓపెన్‌గా తన ప్రేమను చాటుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీ మ్యాన్‌లో సమంత చేసిన యాక్షన్, ఎమోషనల్ అంశాలు ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా.. తన ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలు బలంగా ముందు ఉండటంతో కొన్నింటిని నిరాకరించినట్టు సమాచారం. అయితే ఇప్పడిప్పుడే ఆమె అన్ని సమస్యలను ఎదురించి.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొంటున్నారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ ప్రసాద్ నిర్మించిన యశోద చిత్రం తెలుగులో ఆమెకు భారీ విజయం అందుకొన్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లే కాకుండా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే తర్వాత వచ్చిన శకుంతల, కుషి ఆమెకు మంచి పేరు తెచ్చినా.. ఆర్థికంగా అంతగా సంతృప్తిని ఇవ్వలేదనేది ట్రేడ్ రిపోర్ట్.
అయితే చాలా గ్యాప్ తర్వాత సమంత నటించిన సిటెడాల్: హానీ బన్నీ సిరీస్ రిలీజ్‌కు సిద్దమైంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ముంబైలో జరిగిన ఈవెంట్ తర్వాత సమంత క్రేజ్ బాలీవుడ్‌లో రెండితలు పెరిగిపోయింది. అలాగే ఈ సిరీస్‌పై భారీగా అంచనాలు పెంచేలా చేసింది.

సిటాడెల్ ముంబై ఈవెంట్‌లో హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. సమంత లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి హీరోలను ధీటుగా ఆమె చేసిన ఫైట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సమంతపై నేను ఎప్పటి నుంచో ఫిదా అయ్యాను. మక్కీ సినిమా చూసిన తర్వాత ఆమె అభిమానిగా మారిపోయాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశాన్ని గర్వంగా ఫీల్ అవుతాను అని అన్నారు.
సమంత, వరుణ్ ధావన్ జంటగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన సిటాడెల్: హానీ బన్నీ చిత్రం నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సిరీస్ తర్వాత రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను రాజ్ అండ్ డీకే నిర్మిస్తుండగా, తుంబాడ్ ఫేమ్ రాహీ అనిల్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











