Samantha Ruth Prabhu: వాళ్లను జీవితంలో క్షమించను.. సమంత ఘాటు వ్యాఖ్యలు
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత. నాటి నుంచి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆమె.. కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అవ్వడంతో పాటు బిజినెస్, పికెల్ బాల్ లీగ్‌లో జోరుగా పాల్గొంటున్నారు. రాజ్‌తో పెళ్లి తర్వాతి నుంచి సమంత కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ అగ్రనటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చైతూతో విడాకుల తర్వాత ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో పడ్డారు. అప్పటికే రాజ్‌కు పెళ్లయింది. సమంత- రాజ్‌లు పబ్లిక్‌గానే తిరుగుతుండటంతో వారి బంధంపై మీడియా కోడై కూసింది. రాజ్ ఎక్కడుంటే సమంత అక్కడ ఉండటం, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుండటంతో జనాలు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. తొలుత తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకుమించి ఏం లేదని ఇద్దరూ ఈ పుకార్లను ఖండించారు.

అయితే చివరికి అందరూ అనుమానించిందే జరిగింది. రాజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమంత హింట్ ఇచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో భూతశుద్ధి వివాహం అనే ప్రక్రియ ద్వారా వీరిద్దరూ ఒక్కటయ్యారు. కొన్నాళ్లు ఇద్దరూ ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సమంత తన రోజువారి జీవితంలో బిజీ అయ్యారు. తను స్వయంగా నిర్మిస్తోన్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటూ వస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మిస్తోన్న రెండో చిత్రం ఇది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ... రాజ్ నిడిమోరు ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సమంత అధికారికంగా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 15వ తేదీన మా ఇంటి బంగారం విడుదల కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటిస్తోన్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ మధ్యతరగతి గృహిణిగా నటించనున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా.. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు.
కాగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో లైవ్ చిట్‌చాట్‌లు నిర్వహిస్తారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సండే విత్ యూ అంటూ అభిమానులను పలకరించిన సామ్.. వారు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. అయితే ఓ ప్రశ్న మాత్రం సమంతకు ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌పై ఎలా స్పందిస్తారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సమంత ఘాటుగా బదులిచ్చింది.
నన్ను ప్రశంసలు కదిలించలేవు.. విమర్శలు కూడా ప్రభావం చూపలేవు. అయితే నెగిటివిటీని నా ఇంట్లోకి తీసుకొస్తే మాత్రం బ్లాక్ చేస్తా. నా స్పేస్‌ను క్లీన్‌గా ఉంచుకుంటా. మీలాంటి వారికి నా దగ్గర చోటివ్వను.. అలాగని నేను బాధపడ్డానని కాదు అని సమంత తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











