మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!

సమంత రూత్ ప్రభు.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సుందరాంగి టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మాయ చేస్తోంది. తద్వారా సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది. వాస్తవానికి కెరీర్ ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. అప్పటి నుంచి అదే విధంగా దూసుకుపోతోంది. ఇక, డివోర్స్ తర్వాత మరింత స్పీడు చూపిస్తోన్న సమంత.. మరిన్ని ప్రాజెక్టుల్లో నటిస్తూ మెప్పిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వేడి పుట్టించేలా దిగిన ఈ పిక్‌లపై మీరు కూడా ఓ కన్నేయండి మరి!

ఆరంభంలో అలా.. ఇప్పుడిలాగ

ఆరంభంలో అలా.. ఇప్పుడిలాగ

'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమైన సమంత.. అప్పటి నుంచి వెనుదిరిగి చూసే పరిస్థితినే తెచ్చుకోలేదు. అంతలా ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ ఆడిపాడింది. అయితే, ఇప్పుడు మాత్రం సామ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాత్రను బట్టి సినిమాలు ఒప్పుకుంటోంది.

ఆ సిరీస్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్

ఆ సిరీస్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్

సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమంత.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఫలితంగా ఆమెకు చాలా బాలీవుడ్ అవకాశాలు దక్కుతున్నాయి.

ఆ మూవీ రిలీజ్.. మరొకటి రెడీ

ఆ మూవీ రిలీజ్.. మరొకటి రెడీ

సమంత.. విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో నటించింది. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఇక, ప్రస్తుతం సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను నీలిమ నిర్మిస్తున్నారు.

మరికొన్ని ప్రాజెక్టుల్లో భాగంగా

మరికొన్ని ప్రాజెక్టుల్లో భాగంగా


సమంత గతంలో కంటే మరింతగా పాపులర్ అవడంతో ఆమెకు హాలీవుడ్ ఆఫర్ కూడా దక్కింది. ఇందులో భాగంగానే BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఓ వెబ్ ఫిల్మ్‌లో నటించబోతుంది. ఇది 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. దీనితో పాటు 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమానూ చేస్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటూ మరింతగా ఫేమస్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో మాయ చేసేలా

గ్లామర్ ట్రీట్‌తో మాయ చేసేలా

సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత మరింత యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ అందాలను ఆరబోస్తూ మాంచి కిక్కిస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మజాను పంచుతోంది. ఇలా సమంత తన ఫిగర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ మరింత హాట్ టాపిక్ అవుతోంది.

బుల్లి గౌనులో వయ్యారపు ఫోజు

బుల్లి గౌనులో వయ్యారపు ఫోజు

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొన్ని ఫొటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బుల్లి గౌను మాత్రమే ధరించి ఉంది. దీంతో సమంత అందాలు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె క్లీవేజ్, తొడ భాగాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X