విడాకుల తర్వాత సమంతకు అరుదైన గౌరవం.. ఆ వేడుకలో పాల్గొననున్న మొట్టమొదటి దక్షిణాది నటిగా గుర్తింపు!

ఈ మధ్యనే విడాకులు తీసుకుని ఆ బాధ నుంచి బయట పడేందుకు అనేక తిప్పలు పడుతున్న స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం లభించింది. అసలు ఏం జరిగింది? సమంతకు లభించిన అరుదైన గౌరవం ఏమిటి? ఆ వివరాలలోకి వెళితే

బాధ తగ్గించుకునేందుకు

బాధ తగ్గించుకునేందుకు

ఈ మధ్య కాలంలోనే విడాకులు ప్రకటించిన అక్కినేని నాగచైతన్య సమంత గురించి అభిమానులు ఎంతగానో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అదే సమంత కూడా పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు మాత్రమే కాక మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకుంది. ఇక ఆమె బాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రెమ్యునరషన్ పెంచి

రెమ్యునరషన్ పెంచి

హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్‌‌కు సంతకం చేయడమే కాకుండా రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచారని ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా పలు ఈవెంట్స్‌కు కూడా ఆమె స్పెషల్‌ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఇలా విడాకుల బాధ నుంచి బయట పడేందుకు సామ్‌ కూడా తన షెడ్యూల్‌ ను కావాలని బిజీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కిందని అంటున్నారు. ఈ నెల గోవాలో జరిగే 'ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా' కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది.

తొలి సౌత్ నటిగా

తొలి సౌత్ నటిగా

ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఇక వ్యాఖ్యాతగా సమంతతో పాటు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయిను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు. వీరిద్దరూ కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించారు.

వారికి కూడా ఆహ్వానం

వారికి కూడా ఆహ్వానం

ఇక అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందిందని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమం నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. సమంతకు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రావడమే ఈ ఆహ్వానానికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె చాలా సినిమాలను లైన్ లో ఉంచారు.

Recommended Video

Samantha Is Super Excited For Marvel Studios 'Eternals'
వరుస సినిమాలు

వరుస సినిమాలు

గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె శాకుంతలం అనే సినిమా చేస్తూ ఉండగా ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు ఆమె నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. అదే సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమంత షారుక్ అట్లీ సినిమా కోసం సిద్ధమవుతోందని అలాగే తాప్సీ పన్ను ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తోంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ దాని మీద సరైన క్లారిటీ లేదు. ఇవి కాక సమంత హీరోయిన్ గా రెండు సినిమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X