నాగచైతన్య జ్ఞాపకాన్ని వదిలించుకున్న సమంత?. ఏం మిగల్లేదంటూ షాకింగ్ పోస్ట్
ఏమాయ చేశావే సినిమా సమయంలో ప్రేమలో పడ్డ అక్కినేని నాగచైతన్య- సమంతలు గుట్టుగా తమ బంధాన్ని కొనసాగించి ఆపై పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చింది ఈ జంట. వీరి మధ్య మనస్పర్ధలకు, ఇంతటి కఠిన నిర్ణయానికి కారణం ఏమై ఉంటుందనేది నేటి వరకు బయటకు తెలియరాలేదు. కానీ ఎవరి వెర్షన్ వారు వాగుతూనే ఉన్నారు. విడాకుల తర్వాత సమంత గురించి జనం మరిచిపోతున్న దశలో శోభిత - నాగచైతన్యల వివాహం మరోసారి చైతూ మొదటి భార్య గురించిన ప్రస్తావన తీసుకొచ్చింది.
నిర్మాతగా మారిన సమంత
విడాకుల తర్వాత చైతన్య తన పనేదో తాను చేసుకుంటూ వచ్చారు. కానీ శోభితతో ప్రేమలో పడిన విషయాన్ని మాత్రం గుట్టుగా ఉంచి ఓ రోజున సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ , ఆ వెంటనే పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. హనీమూన్ ట్రిప్‌లో భార్యతో గడిపి తిరిగి షూటింగ్ పనుల్లో బిజీ అయ్యాడు. అటు సమంత మొదట్లో విహారయాత్రలతో బాధ నుంచి బయటికొచ్చినా, మయోసైటిస్ వ్యాధి బారినపడి అతికష్టం మీద కోలుకున్నారు. టాలీవుడ్‌కు దూరంగా హిందీలో ఓటీటీలో సినిమాలు చేసుకుంటూ గడిపేస్తోంది. ఇటీవలే నిర్మాతగా మారి తెలుగులో శుభం పేరుతో సినిమా నిర్మించింది.

రాజ్ నిడిమోరుతో సమంత అఫైర్?
నాగచైతన్య మాదిరిగానే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారని, రేపో మాపో శుభవార్త చెబుతారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సమంత- రాజ్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండం, వారిద్దరి సాన్నిహిత్యం అనేక అనుమాలను కలిగిస్తోంది. తమ మధ్య ఎలాంటి బంధం లేదని సామ్, రాజ్‌లు వేర్వేరుగా ప్రకటనలు ఇస్తున్నా.. జరుగుతున్న పరిణామాలు మరో అర్ధాన్ని తీసుకొస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తిలకు రాజ్ నిడిమోరుతో కలిసి వెళ్లడం.. ప్రత్యేక పూజలు జనానికి వీరి బంధంపై బలమైన సంకేతాలు పంపుతున్నాయి.
చైతూపై పరోక్ష వ్యాఖ్యలు
నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎప్పుడూ తన ఆయన గురించి బహిరంగంగా మాట్లాడలేదు సమంత. అయితే అప్పుడప్పుడు పరోక్ష వ్యాఖ్యలు చేస్తోంది. తన మాజీకి ఖరీదైన గిఫ్ట్‌లు కొనడం జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని ఒకసారి సామ్ వ్యాఖ్యానించింది. భార్యలకు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే వారిని వదిలించుకోవడానికి భర్తలు వెనుకాడరని ఓ సర్వేను లైక్ చేయడం .. తదితర సంఘటనలు వీరి విడాకులపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
చైతూ గుర్తుల్ని చెరిపేస్తోన్న సమంత
నాగచైతన్య సంబంధించిన గుర్తులు, జ్ఞాపకాలు తన వద్ద ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా సామ్ ప్రవర్తిస్తున్నారు. నాగచైతన్యతో ప్రేమలో ఉన్న సమయంలో వేయించుకున్న టాటూ సరిగా కనిపించకపోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇదే రకమైన టాటూ చేతిపైనా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కాదు.. సమంత మెడ భాగంలో మరో టాటూ కనిపించపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం సమంత ఓ స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానిలో నథింగ్ టూ హైడ్ అని చెబుతూ.. మంచి ఉద్దేశంతో మొదలైంది అంటూ క్యాప్షన్ పెట్టారు.
సమంత మెడపై కనిపించని టాటూ
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంత మెడ కింద భాగంలో ఉన్న వైఎంసీ (ఏం మాయ చేశావే) టాటూ కనిపించలేదు. చైతన్యతో తను ప్రేమలో పడటానికి కారణమైన ఈ సినిమాను తన మెడపై వైఎంసీ అని పచ్చబొట్టు వేయించుకున్నారు సమంత. విడాకుల తర్వాత కూడా చాన్నాళ్ల పాటు అదే ప్లేస్‌లో టాటూ కనిపించేది. కానీ తాజా వీడియోలో సమంత మెడ కింద భాగంలోని ఈ టాటూ మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిని సమంత తొలగించేశారా? అని కొందరు.. కాదు ఓవర్ మేకప్‌తో దానిని కవర్ చేశారని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











