Samantha Ruth Prabhu హాలీవుడ్‌లోకి సమంత.. మూవీ ఎన్ని భాషల్లో? హీరో, నిర్మాత, దర్శకులు ఎవరంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా దూసుకెళ్తున్నది. హిట్లు, ఫెయిల్యూర్స్ అనే సంబంధం లేకుండా భారీ ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నాయి. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతో సమంత రుత్ ప్రభు కెరీర్ పరంగా మెరుగైన ప్రదర్శనను ఇస్తున్నారు.

ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తన కెరీర్ కొత్త కోణంలోకి మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సమంత రుత్ ప్రభు హాలీవుడ్‌ సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నది. సమంత హాలీవుడ్ సినిమా, అలాగే ఆమె కెరీర్ వివరాల్లోకి వెళితే..

Samantha Ruth Prabhu Hollywood entry with Chennai Stories: Here is details of the movie

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత ఫెర్ఫార్మెన్స్ మరో జోన్‌లోకి వెళ్లింది. అప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గా పడిన ముద్ర నుంచి బయటకు వచ్చింది. యాక్షన్ సీన్లతో అదరగొట్టడం, ఫైట్స్ ఆకట్టుకోవడంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి. దాంతో ఆమె ఇమేజ్ కూడా కొత్తగా బిల్డ్ అవుతున్నది.

Samantha Ruth Prabhu Hollywood entry with Chennai Stories: Here is details of the movie

యశోద మూవీతో భారీ హిట్: ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంత నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా కెరీర్ బెస్ట్ కలెక్షన్లు నమోదయ్యాయి. హీరోయిన్‌గా తన కెరీర్‌లోనే బెస్ట్ బాక్సాఫీస్ నంబర్స్‌ను సొంతం చేసుకొని.. దర్శక, నిర్మాతల అంచనాలు పెంచేలా చేసింది.

Samantha Ruth Prabhu Hollywood entry with Chennai Stories: Here is details of the movie

నిరాశ పరిచిన శాకుంతలం: ఇటీవల రిలీజైన శాకుంతలం సినిమా సమంత రుత్ ప్రభుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజైన ఈ చిత్రం మా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చూసింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డును అందుకోవడం గమనార్హం.

Samantha Ruth Prabhu Hollywood entry with Chennai Stories: Here is details of the movie

సిటాడెల్ వెబ్ సిరీస్‌లో: సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్‌లో సమంత నటిస్తున్నది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సిరీస్‌లో యాక్షన్, లవ్, రొమాంటిక్ సీన్లలో ఘాటుగా నటించినట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

హాలీవుడ్‌లోకి చెన్నై స్టోరీస్ మూవీతో: ఇలా ఇండియన్ స్క్రీన్‌పై తనదైన శైలిలో రాణిస్తున్న సమంత రుత్ ప్రభు హాలీవుడ్‌లో అడుగుపెడుతున్నది. ది అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు చెన్నై స్టోరీస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను ఇంగ్లీష్, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇండియా, బ్రిటన్‌లో చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.

Samantha Ruth Prabhu Hollywood entry with Chennai Stories: Here is details of the movie

చెన్నై స్టోరీస్ నిర్మాత ఎవరంటే?: సమంత నటించే చెన్నై స్టోరిస్ చిత్రానికి బాఫ్టా అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్, నిమ్మి హరాస్‌గామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గురు ఫిలింస్ బ్యానర్‌పై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడిగా వివేక్ కల్రా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X