For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa టీమ్ కు సమంత కండిషన్స్.. అన్నింటినీ వెంటనే ఒప్పుకున్న సుకుమార్.. కండిషన్లు ఏమంటే?

  |

  నాగ చైతన్య విడాకుల తరువాత సమంత మొట్టమొదటి సారిగా ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో భాగం అయింది. అంతకు ముందు కొన్ని సినిమాల షూటింగుల్లో పాల్గొన్నా ఇప్పుడు ఆమె చేయబోయే పుష్ప సాంగ్ షూటింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పాలి.. ఈ నేపథ్యంలోనే షూటింగ్ విషయంలో ఆమె పుష్ప యూనిట్ కు అనేక కండిషన్లు పెట్టింది అని తెలుస్తోంది. సమంత పెట్టిన కండిషన్ ఏంటి? దానికి పుష్ప యూనిట్ ఒప్పుకుందా? అనే వివరాల్లోకి వెళితే

  Recommended Video

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
  మొదటి వర్క్ అసైన్‌మెంట్

  మొదటి వర్క్ అసైన్‌మెంట్

  ఇప్పటి వరకు హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన సమంత మొట్టమొదటిసారిగా సుకుమార్ దర్శకత్వంలో ఒక ఐటమ్ కి కాళ్లు కదపనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సమంత తన మొట్టమొదటి ఐటెమ్ నంబర్‌ను చేయనుందని ఇప్పుడు యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఒక రకంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు ఇది మొదటి వర్క్ అసైన్‌మెంట్ కావడంతో ఈ సాంగ్ షూటింగ్ మొదటి మీద ఆమె గట్టిగానే ఫోకస్ పెట్టింది.

  పుష్ప టీంకు షరతులు

  పుష్ప టీంకు షరతులు

  అందుకే కాక పుష్ప టీంకు ఆమె కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. నిజానికి మొదట, నగరం నడిబొడ్డున ఉన్న స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌ ను ప్లాన్ చేసారు. అయితే దాన్ని సిటీకి దూరంగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చమని సమంత టీమ్‌ని కోరిందట. అందుకు కారణం ఆమె మీడియాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా ఉండడం కోసమే అని అంటున్నారు. ఒక రకంగా మీడియా ప్రతినిధుల తో ఇంటరాక్షన్ ప్రస్తుతానికి ఆమెకు ఇష్టం లేదని అంటున్నారు.

  ఎమోషనల్ మూమెంట్

  ఎమోషనల్ మూమెంట్

  ఇక విడాకుల తర్వాత ఆమె మొదటి సారి కెమెరాను ఎదుర్కోవడం ఎమోషనల్ మూమెంట్ అవుతుందని, అది కూడా ఒక స్టార్ సినిమా కోసం చేయనుండడంతో ఆమె కాస్త భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్న కారణంగా ఆమెకు ఈ స్పేస్ కావాలి అని చెబుతున్నారు. అలాగే పాట సెటప్‌, నటీనటుల లుక్‌లను కూడా గోప్యంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్న సుకుమార్ కూడా సమంత కోరిన వెంటనే ఆమె కండిషన్లకు ఓకే చెప్పినట్టు సమాచారం.

   ఎక్కడా తగ్గకుండా

  ఎక్కడా తగ్గకుండా

  అందుతున్న సమాచారం మేరకు సాంగ్ షూట్ కోసం సమంత ఐదు కాల్షీట్లు ఇచ్చింది. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో గతంలో కొన్ని సంచలనాత్మక చార్ట్‌బస్టర్ ఐటెం సాంగ్స్ వచ్చాయి. దీంతో ఈసారి కూడా ఏమీ తక్కువ కాకుండా ఉండేలా చూస్తున్నారు.

  అత్యద్భుతమైన ఐటెం సాంగ్

  అత్యద్భుతమైన ఐటెం సాంగ్

  నిజానికి సుకుమార్ ప్రతి సినిమాలో కూడా ఒక అత్యద్భుతమైన ఐటెం సాంగ్ ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాదాపుగా ఆయన అన్ని సినిమాల్లో చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమాలో చేయబోతున్న సాంగ్ మీద కూడా భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

  English summary
  Samantha Ruth Prabhu imposes conditions to Pushpa unit for song shooting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X