twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Samantha Ruth Prabhu రెమ్యునరేషన్ కంటే ఆ రకంగానే సంపాదన ఎక్కువ.. అందుకే ఇలా..

    |

    ఇటీవల కాలంలో సెలబ్రిటీ హోదా అనేది అడుగడుగున ఒక బిజినెస్ గా మారుతొంది అనే చెప్పాలి. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే స్టార్ హోదాతో ప్రతి రూట్లోనూ కోట్ల రూపాయలను అందుకోవచ్చు ని కొంత మంది పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోవడం విశేషం. ఇక సమంత రూత్ ప్రభు కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

    బాలీవుడ్ లో కూడా

    బాలీవుడ్ లో కూడా

    సమంత రూత్ ప్రభు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన కెరీర్ విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా తన కెరీర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టుకున్న సమంత ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

    ఎవరూ ఊహించని రేంజ్ లో..

    ఎవరూ ఊహించని రేంజ్ లో..

    అయితే పెళ్లి ముందు వరకు కూడా సమంత గ్లామర్ విషయంలో చాలా వరకు కొంత బార్డర్ దాటి ముందుకు వెళ్లలేదు. కానీ విడాకుల అనంతరం మాత్రం ఆమె తన కెరీర్ మరో రేంజ్ కి వెళ్లే విధంగా గ్లామర్ ప్రపంచంలో బోర్డర్ దాటేసి ఘాటైన లుక్స్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అయితే ఎవరూ ఊహించని రేంజ్ లో అందాల ప్రదర్శనతో మరింత హాట్ టాపిక్ గా మారుతొంది అనే చెప్పాలి.

    గ్లామర్ తో ఆదాయాన్ని పెంచుకునేలా..

    గ్లామర్ తో ఆదాయాన్ని పెంచుకునేలా..

    సమంత రూత్ ప్రభు తన ఇన్స్టాగ్రామ్ లో కూడా తరచుగా గ్లామరస్ ఫోటోలతో ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇస్తోంది. ఇటీవల ఒక ట్రెండీ లుక్ తో ఆమె బికినీ అందాలను హైలైట్ చేసింది. ఒకవైపు గ్లామర్ డోస్ పెంచుతూనే మరొక వైపు ఆమె ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక బ్రాండెడ్ కంపెనీలకు ఈ తరహా గ్లామర్ తో ప్రమోట్ చేస్తే భారీ స్థాయిలో ఆదాయం అందుతూ ఉంటుంది.

    నెలకు 3కోట్ల ఆదాయం

    నెలకు 3కోట్ల ఆదాయం

    ఇక సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసినా కూడా లక్షల్లో ఆదాయం అందుతుంది. ఇక ఆ రూట్లో ఆమె నెలకు దాదాపు మూడు కోట్ల వరకు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక మంది ఇన్ స్టా ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్లలో సమంత టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రేంజ్ పెరగడంతో బ్రాండ్ ప్రమోషన్ వ్యాల్యూ కూడా పెరిగింది. దీంతో ఆమె నెలకు ఇన్స్టాగ్రామ్ ద్వారానే మూడు కోట్ల వరకు ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం.

     సినిమాలతో కూడా..

    సినిమాలతో కూడా..

    కేవలం సమంత అని మాత్రమే కాదు చాలా మంది హీరోలు కూడా ఇదే తరహాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఒక సినిమాకు ప్రస్తుతం మూడు కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాకుంతలం యశోద అనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె త్వరలో విభిన్నమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించబోతోంది.

    English summary
    Samantha ruth prabhu income from social media instagram post
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X