నాగచైతన్య చేసిందేం లేదు.. పెళ్లితో బుద్దొచ్చింది.. చైతూపై సమంత ఘాటు వ్యాఖ్యలు
అక్కినేని నాగచైతన్య - సమంతలు విడిపోయి నాలుగేళ్లపైనే అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల గురించి, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రజలు, మీడియా ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. సమంత - నాగచైతన్య ఎందుకు విడిపోయారు? విడాకులకు దారి తీసిన కారణాలేంటీ? అంటూ ఎవరి వెర్షన్ వారు వినిపిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా పదే పదే నాగచైతన్యతో వివాహం, విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో సమంతకు చిర్రెత్తుకొచ్చింది.

ఏమాయ చేశావేతో ప్రేమలో పడ్డ చై- సామ్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే సినిమాలో నాగచైతన్య - సమంతలు తొలిసారిగా కలిసి నటించారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న ఈ జంట గోవాలో ఒక్కటైంది. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో నాలుగేళ్లు తిరిగేసరికి గొడవలు మొదలయ్యాయి.
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు
ఈ దశలో తన పేరుకు ముందున్న అక్కినేని ఇంటిపేరును తీసేయడంతో పాటు నాగచైతన్యతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమంత తొలగించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ దశలో 2021లో వీరిద్దరికి ఫ్యామిలీ కోర్ట్ విడాకులు మంజూరు చేసిన విషయాన్ని సమంత, నాగచైతన్యలు వేర్వేరుగా ప్రకటించడంతో అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు.
శోభితతో చైతూ రెండో పెళ్లి
విడాకుల అనంతరం ఇద్దరి దారులు వేరవ్వగా.. చైతూ, సామ్‌లు తమ తమ రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. సామ్ డిప్రెషన్‌లోకి వెళ్లడంతో పాటు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురై చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లు మరుగునపడిన సామ్ - చైతూల విడాకుల వ్యవహారంతో నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వెంటనే సమంత- నాగచైతన్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.
రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం?
నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో ఆయన జ్ఞాపకాలను చెరిపేస్తూ వచ్చిన సమంత ఏనాడూ తన మాజీ భర్త గురించి మాట్లాడలేదు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య పేరు ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవలి వీరిద్దరూ తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
జీవితం పాఠం నేర్పిందన్న సమంత
తాజాగా సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తన సినిమా ప్రమోషన్ కోసం సామ్ గట్టిగానే కష్టపడుతున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, మీడియా మీట్‌లు నిర్వహిస్తున్నారు. లైఫ్ తనకు చాలా పెద్ద గుణపాఠం నేర్పిందని, ఇకపై తన జీవితంపై గురించి మాట్లాడనని సమంత చెప్పారు. అనంతరం యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఏమాయ చేశావే సినిమాయే కారణమన్న సామ్.. గౌతమ్ సార్ చేసిన ఆడిషన్ వల్లే ఈ పొజిషన్‌లో ఉన్నానని సమంత చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తన కోసం నాగచైతన్యం ఏం చేయలేదనే అర్ధం వచ్చేలా సామ్ మాట్లాడారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











