నాగచైతన్య ఎంగేజ్‌మెంట్: సమంత షాకింగ్ పోస్ట్.. గుర్తుంచుకో అంటూ కామెంట్
అక్కినేని వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు తన జీవితాన్ని తన స్టైల్‌లో ఆస్వాదిస్తున్నది. డైవోర్స్ తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లు మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సమంత అఫైర్లు, డేటింగ్ విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ.. ఏదీ కన్ఫార్మ్‌గా చెప్పలేదు. అయితే నాగచైతన్య మాత్రం శోభితా ధూళిపాలతో లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడనే కన్ఫార్మ్ అయిపోయింది. అయితే తాజాగా నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ వార్త, రూమర్ హడావిడి చేస్తున్న నేపథ్యంలో సమంత పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా నాగగచైతన్య, శోభిత డేటింగ్ వ్యవహారం రెడ్ హ్యాండెడ్‌గా బయటకు వచ్చింది. వారిద్దరూ పీకల్లోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చైతూ, శోభితా ఇద్దరు లండన్‌లోని ఓ హోటల్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్‌ను బయటపెట్టాయి.

తాజాగా చైతూ, శోభితా ఇద్దరు నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ నిశ్చితార్థం జరుగుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త బాంబులా పేలింది. దాంతో ఈ వార్త నిజమేనా అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.అయితే రెండు సైడ్ల నుంచి ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఈ విషయం మరింత అనుమానాస్పదంగా మారింది.
ఇదిలా ఉండగా, చైతూ, శోభితా ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఆసక్తికరమైన పోస్టును తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు ప్రకారం.. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్లు.. ఎప్పడూ కూడా ఒంటరివాళ్లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ తన పోస్టులో పెట్టారు.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పై నుంచి ఓ శక్తి నిన్ను కాపాడుతుంటుంది. ఎల్లప్పుడు ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది. అలాంటి సమయంలో నీ మానసిక స్థైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడూ మేమంత అండగా ఉంటాం అంటూ వినేశ్ పోగట్ గురించి ఓ పోస్టు పెట్టారు. అయితే వినేశ్‌తోపాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్టు చేసిందనే కామెంట్స్ నెటిజన్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆమె బిజీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. ఇంకా సినిమాల విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదనే విషయం గమనార్హం. తమిళంలో ఓ సినిమా చేస్తుందనే విషయం మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతున్నది.


Click it and Unblock the Notifications











