వాళ్లిద్దరూ నన్ను చెడగొట్టారు.. అందుకే అలాంటి పాత్రలు చేయడం లేదు.. సమంత కామెంట్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ గుర్తింపు సంపాదించుకుంది. ఆమె తన కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. తన అందం, అభినయంలో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే.. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఈ అమ్మడు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. తనదైన సత్తా చాటింది. అయితే.. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ డి.కె పై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా హీరోయిన్ సమంతా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్, అప్ కమ్మింగ్ సినిమాల అప్డేట్స్ షేర్ చేసుకుంది. ఈ సమయంలో.. తమిళ సినిమాల్లో ఎందుకు నటించడం లేదనీ ప్రశ్నించగా.. నటి సమంత ఇలా స్పందించారు. " వరుసగా సినిమాలు చేయడం చాలా సులభం, కానీ, నేను ప్రతి సినిమాను నా జీవితంలో ఇదే చివరి సినిమాగా భావిస్తాను. ప్రతిది పర్ఫెక్ట్ గా ఉంటేనే చేస్తాను. అందులోనూ నేను చేయగలనని వంద శాతం నమ్మితేనే చేశాను. అలా నచ్చకపోతే.. ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తాను' అని బదులిచ్చారు. సమంతా నటించిన చివరి తమిళ చిత్రం కత్తువాక్కుల రెండు కాదల్. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

అలాగే.. దర్శకులు రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే లతో కలిసి వర్క్ చేయడంపై కూడా సమంత స్పందించారు. వీరితో కలిసి సమంత 'ఫ్యామిలీమ్యాన్ 2' , సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. 'సిటాడెల్ లో సమంత సరసన వరుణ ధావన్ నటిస్తున్నాడు. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ల్లో పనిచేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకో గలిగనని తెలిపారు."నన్ను నేను సవాలు చేసుకునే పాత్రల్లో నటించేలా చేశారు. ప్రతి విషయాన్ని లోతుగా నేర్చుకునే చేశారు. దీంతో ఛాలెంజ్ పాత్రల్లోనే నటించేలా అలవాటు చేశారు. అలా వాళ్లిద్దరూ నన్ను చెడగొట్టారు ' అంటూ ఫన్ని గా బదులిచ్చింది. సమంతకు,
నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి పడ్డారు. కాస్త ఆ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సమంతా 2023లో శాకుంతల, కుషి అనే తెలుగు సినిమాల్లో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత 2024లో సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సీరిస్ లో నటించారు. ఈ సిరీస్‌లో బన్నీగా వరుణ్ ధావన్‌తో పాటు సమంత హనీ పాత్రను పోషించింది. యుఎస్ సిరీస్ సిటాడెల్‌కి యాక్షన్-ప్యాక్డ్ ప్రీక్వెల్ గా సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే..

సమంత రాబోయే ప్రాజెక్ట్‌లు విషయానికి వస్తే..మున్ముందు సమంత ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ తో రాబోతుంది. ఆమె త్వరలో రాజ్ , DK దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ యాక్షన్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ప్రాజెక్ట్‌గా భావించే ఈ సిరీస్‌లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి, అలీ ఫజల్, నికితిన్ ధీర్ వంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











