Samantha: రెండో పెళ్లి చేసుకోరా? నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగేలా సమంత జవాబు!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంత లీడ్ లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఇదెలా ఉంటే.. తాజాగా హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ నెట్టింట్లో తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఎంటీ? అందులో సమంత ఏం కామెంట్స్ చేసింది? ఈ మీరు కూడా ఓ లూక్కేయండి.
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. 'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. డెబ్యూ మూవీ కావడంతో సమంతకు మూవీ మేకర్స్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి, చాలా తక్కువ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోయింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. టాలీవుడ్ దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది.
మరోవైపు.. తన తొలి సినిమా ఏమాయ చేశావే మూవీ సమయంలోనే హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీరి వివాహం బంధం మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఇండస్ట్రీనే కాదు, మూవీ లవర్స్ కూడా షాక్ అయ్యారు. సమంత తన పర్సనల్ లైఫ్ లో ఓడిపోయినా.. తన ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం దూసుకెళ్లుందనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సమంత.
నాగచైతన్య నుంచి విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారినపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి నివారణకు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. అలా దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తన ఆరోగ్యం మెరుగుపడ్డ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. అయితే.. టాలీవుడ్ దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రమోషన్లలో సమంత ఫుల్ బిజీబిజీగా మారింది.

ఇదిలాఉంటే.. హీరోయిన్ సమంత ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ చిట్ చాట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంది. వీకెండ్ సార్ టైం లో సమంత ఎలా ఉంటారని ప్రశ్నించగా.. తాను ఎక్కువగా పాడ్ కాస్ట్ వింటుంటానని, చాలామంది తాను ఇండస్ట్రీ నుండి వచ్చాను కాబట్టి మూవీస్ కు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన వాటి గురించి వింటారా భావించవచ్చు కానీ, తాను అన్పర్చినట్లు హెల్త్ కు సంబంధించిన ఆడియోస్ ను ఎక్కువగా వింటానని, ఇంగ్లీషులో ప్రసారమయ్యే డాక్టర్ హ్యుబర్ మెన్ చాలా ఎక్కువ గా వింటానని, అందులోని తాను ఫన్ వెతుక్కుంటానని చెప్పుకొచ్చారు.
సమంత తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తుంది? హాలీవుడ్లో నా బాలీవుడ్ లో నా అని ప్రశ్నించగా.. నాకు నేను రెస్ట్రిక్ట్ చేసుకోలేని ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ నటిస్తానని, ప్రేక్షకులను ఎంటర్టైజ్ చేయడమే ఫైనల్ అన్నది. ఈ సమయంలో సమంతను మరో స్పెషల్ సాంగ్స్ చూడగలమా ? అని ప్రశ్నించగా.. అందుకు లేదంటూ సమాధానం ఇచ్చింది. అలాగే మీరు సింగల్ గా ఉండాలని అనుకుంటున్నారా ? అని ప్రశ్నించగా.. లేదంటూ షాకింగ్ సమాధానం చెప్పింది. ఇకపై సామ్ స్పెషల్ సాంగ్స్ చేయదా.. అలాగే సింగిల్ కాకుండా మింగిల్ అవ్వడానికి రెడీగా ఉందంటూ.. కామెంట్స్ చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











