For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  |

  సమంత రూత్ ప్రభు... తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు దశాబ్దా కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. 'ఏమాయ చేశావే'తో అందరినీ మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని భాషల్లోనూ ఆమె సత్తా చాటుతోంది. ఇక, ఇటీవలే విడాకులు ప్రకటించిన సమంత.. ఇప్పుడు కెరీర్‌పైనే బాగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ తెలుగులో ఎవరూ చేయని విధంగా ఓ సంచలన ప్రకటన చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  రెండు చోట్లా హవాను చూపిస్తోన్న సామ్

  రెండు చోట్లా హవాను చూపిస్తోన్న సామ్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. ఇప్పటికీ ఆమె ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ స్టార్ హీరోలతో ఆడిపాడింది. అలా అక్కడా ఇక్కడా హవాను చూపిస్తోంది. దీంతో రెండు చోట్లా దూసుకెళ్తోంది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  సినిమాల్లోనే కాదు... అందులోనూ సత్తా

  సినిమాల్లోనే కాదు... అందులోనూ సత్తా


  సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇది సమంత రేంజ్‌ను నేషనల్ లెవెల్‌కు పెంచేసిందని చెప్పొచ్చు.

  భారీ చిత్రాన్ని కంప్లీట్ చేసేసిన బ్యూటీ

  భారీ చిత్రాన్ని కంప్లీట్ చేసేసిన బ్యూటీ


  'జాను' మూవీ తర్వాత స్పీడు తగ్గించిన సమంత.. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  విడాకుల ప్రకటన తర్వాత దూకుడుగా

  విడాకుల ప్రకటన తర్వాత దూకుడుగా

  సమంత కొన్నేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ బంధానికి తెర దించుతూ ఇటీవలే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక, విడాకుల తర్వాత సామ్ కెరీర్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 'పుష్ప'లో స్పెషల్ సాంగ్‌ చేయబోతుంది. అలాగే, మహేశ్ - త్రివిక్రమ్ మూవీలోనూ నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది.

  ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ను ప్రకటించింది

  ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ను ప్రకటించింది


  ఇంత కాలం దక్షిణాది సినిమాలకే పరిమితమైన సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లోనే నటించనుంది. ఈ విషయాన్ని సామ్ తాజాగా ప్రకటించింది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందబోతుంది.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  12 ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చిందని చెప్పి

  12 ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చిందని చెప్పి

  తాజాగా దర్శకుడు ఫిలిప్ జాన్‌తో దిగిన ఫొటోను షేర్ చేసిన సమంత.. 'కొత్త ప్రపంచం.. 12 ఏళ్ల క్రితం ఏమాయ చేశావే కోసం ఆడిషన్ ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు నాకెంతో ఇష్టమైన దర్శకుడు ఫిలిప్ దగ్గర ఆడిషన్ ఇచ్చాను. నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు సునీత తాటికి థ్యాంక్స్. ఈ జర్నీ కోసం ఆత్రుతగా చూస్తున్నా' అని పేర్కొంది.

  Recommended Video

  Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత

  ఇక, ఇందులో సమంత చేస్తున్న పాత్ర గురించి 'నేను చేయబోయే పాత్ర ఎంతో కష్టమైనది. దీన్ని సవాలుగా తీసుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో సమంత బైసెక్సువల్ అయిన తమిళ మహిళగా నటించబోతుందట. తద్వారా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌లో.. అలాంటి పాత్రలో నటిస్తోన్న తొలి స్టార్ హీరోయిన్‌గా సమంత నిలిచింది.

  English summary
  Samantha Ruth Prabhu to play bisexual woman in Downton Abbey director Philip John’s next Arrangements of Love.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X