Samantha Ruth Prabhu interview నాకు మొండితనం ఎక్కువ.. అలా డిసైడ్ అయ్యా.. సమంత కంటతడి
యశోద సినిమా పర్‌ఫెక్ట్ థ్రిల్లర్. అయితే రొటీన్ థ్రిల్లర్‌గా ఉండదు. చాలా ఫర్‌ఫెక్ట్‌గా ప్రొడక్ట్ వచ్చింది. అందుకే మాకు బాగా టెన్షన్ వస్తుంది. యశోద సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్. సినిమా చూసిన తర్వాత కాన్సెప్ట్‌ను అందరూ మెచ్చుకొంటారు. యశోదకు వెంకటేష్ మార్తాండ్ లాంటి గ్రేట్ ప్రొఫెషనల్స్ పనిచేశారు. యశోద గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ..

డిఫరెంట్‌గా యశోద
యశోద జర్నీ చాలా డిఫరెంట్‌గా ప్రారంభమైంది. నిజాయితీతో సినిమా ముందుకెళ్లింది. బిగ్ డ్రీమ్స్‌తో సినిమాను మొదలుపెట్టాం. ప్రారంభంలో కొన్ని కష్టాలు వచ్చాయి. కానీ వాటన్నింటిని ఎదురించి మంచి సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నాం.

నిజ జీవితంలో కూడా
పట్టుదలతో యశోద సినిమాను చేశాం. ఈ సినిమాలో యశోద ప్రతికూల పరిస్థితులను ఎదురించి సమస్యలను అధిగమిస్తుంది.. నా నిజ జీవితంలో కూడా అలాంటి కష్టమైన పరిస్థితిని ఎదురిస్తూ వస్తున్నాను. అందుకే ఈ సినిమాలోని యశోద పాత్ర నాకు చాలా దగ్గరైంది అని సమంత చెప్పారు.

ప్రాణం పెట్టి పెర్ఫార్మ్
యశోద సినిమాకు నేను తమిళం, తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత కష్టమైంది. కానీ చాలా ఎక్కువ కేర్ తీసుకొన్నాం. ఏ ఆర్టిస్టుకైనా ప్రాణం పెట్టి పెర్ఫార్మ్ చేసినప్పుడు.. డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం నేను చాలా ఎక్సర్‌సైజ్ చేశాం అని సమంత తెలిపారు.

నాకు మొండితనం ఎక్కువ
యశోద రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టి డబ్బింగ్ చెప్పాను. నాకు మొండితనం ఎక్కువ. నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకొన్నాను. ప్రతికూల సమస్యలు ఎదురైనా.. డబ్బింగ్ సక్సెస్‌ఫుల్‌గా చెప్పాను అని సమంత అన్నారు.

మంచి రోజులు, కొన్ని చెడు రోజులు
జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉంటాయి. నా జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తానా అనే సందేహం వస్తుంది. కానీ వాటన్నింటిని నేను తట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను అని సమంత కంటతడి పెట్టుకొన్నది. తన పరిస్థితిని ఊహించుకొని ఎమోషనల్ అయింది. నా జీవితంలోని సమస్యలను సక్సెస్‌గా డీల్ చేశాను అని సమంత అన్నారు.


Click it and Unblock the Notifications











