Samantha: వాటిని క్షమించడానికి వీల్లేదు.. ఇక పోరాటమే అంటున్న సమంత
టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తొలి సినిమా 'ఏమాయ చేశావే'తోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆమె, వరుస అవకాశాలు అందుకుని అగ్ర కథానాయికగా ఎదిగింది. అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగు, తమిళ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. తన సొంత స్టైల్‌తో సమంత ఇప్పుడు సినిమాలకే కాదు, సోషల్ అవేర్‌నెస్, మహిళల సమస్యలపై కూడా గళం వినిపిస్తూ ప్రభావవంతమైన వ్యక్తిగా నిలుస్తోంది.. తాజాగా క్షమించడానికి వీల్లేదు.. పోరాటమే ఆయుధం అంటూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ పెట్టింది. వివరాల్లోకెళ్తే..
నటి సమంత రూత్ ప్రభు, మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న హింసను అరికట్టే లక్ష్యంతో ఆమె యూఎన్ వుమెన్ ఇండియా (UN Women India)తో చేతులు కలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, సోషల్ మీడియా హింసకు నో ఎక్స్‌క్యూస్ క్యాంపెయిన్ (No Excuse ) అంటూ తాను కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంలో భాగం అవుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు జరిగే 16 డేస్ ఆఫ్ యాక్టివిజం (16 Days of Activism) కార్యక్రమంలో ఆమె పాల్గొనట్లు తెలిపారు.

ఈ ప్రచారం ముఖ్యంగా డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొనే సైబర్ బుల్లింగ్, ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోలు, ఆన్‌లైన్ బెదిరింపులు వంటి సమస్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం. యూఎన్ వుమెన్ ప్రకారం.. ఇవి కేవలం వర్చువల్ సమస్యలు కాదు, హింస, ఇది మహిళలను బెదిరిస్తుంది, మానసికంగా దెబ్బతీస్తుంది. డిజిటల్ హింసకు సమాజం ఎటువంటి కారణాన్నీ అంగీకరించరాదనే సందేశంతో ప్రచారం సాగుతున్నట్లు సమంత తెలిపారు.
ఈ సమయంలో సమంత తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగంతో స్పందించారు. "సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు, బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోలు... మహిళలపై డిజిటల్ దాడులు ఎన్నో రూపాల్లో ఉంటాయి. ఇవి మనసును కుంగదీస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నేను స్వయంగా ఈ వేధింపులను అనుభవించాను," అని ఆమె చెప్పడం గమనార్హం. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా మహిళల్లో అవగాహన పెరగడం, వాళ్లు తమపై జరిగే హింసను ఎదిరించడానికి ధైర్యం సేకరించడమే లక్ష్యమని తెలిపారు. డిజిటల్ హింసను అరికట్టడానికి సైబర్ నిబంధనలు, కఠిన చట్టాలు అవసరమని సమంత స్పష్టంగా పేర్కొన్నారు.
"సమాజం, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. మహిళలు ఆన్‌లైన్ ప్రపంచంలో భయపడకుండా జీవించాలంటే శక్తివంతమైన వ్యవస్థలు కావాలి," అని ఆమె అభిప్రాయపడింది. యూఎన్ వుమెన్ ఇండియా, ఆసియా, యూఎన్ ఇన్ ఇండియా కలిసి ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 2024లో లక్షలాది మహిళలు డిజిటల్ వేధింపులకు గురైనట్లు వివరాలు చూపిస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రొఫైల్‌లు, రివేంజ్ పోర్న్ వంటి వాస్తవాలు మహిళల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. డిజిటల్ హింసకు వ్యతిరేకంగా సమంత పాల్గొనడంపై తన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











