ఆ రెండు లేకపోతే పార్టనర్‌‌ను.. ప్రేమను పొందలేం.. సమంత షాకింగ్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు సమంత రుత్ ప్రభు, నాగచైతన్య ఇద్దరు దాంపత్య జీవితానికి ముగింపు పలికి ఎవరికి వారు తమ జీవితాన్ని ఆస్వాదిస్తున్పప్పటికీ వారి డైవోర్స్ విషయం మీడియాలో ఎప్పుడూ హెడ్‌లైన్లను ఆకర్షిస్తూనే ఉంటున్నది. అయితే ప్రతీ ఇంటర్వ్యూలోను నాగచైతన్య, సమంత తమ తమ అభిప్రాయలను వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా సమంత ఓ హెల్త్ కన్సల్టెంట్ వీడియోను తన స్టేటస్‌లో షేర్ చేశారు. ఆమె చేసిన పోస్టు వైరల్‌గా మారుతున్నది. ఆ వీడియోలో ఏమున్నదనే వివరాల్లోకి వెళితే..

తమ తొలి సినిమా షూటింగులో జరిగిన పరిచయం ప్రేమగా మారి.. ఆ తర్వాత సమంత, చైతూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే వారిద్దరి బ్రేకప్ వార్త అభిమానులను షాక్ గురి చేసింది. అయితే వారి డైవోర్స్ కారణాలు చెప్పకపోయినా.. నాగచైతన్య మాత్రం ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విడాకులకు ముందు 1000 సార్లు ఆలోచించాను. ఆ తర్వాతే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకొన్నాం. నేను బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మాత్రం వెల్లడించారు.

Samantha Ruth Prabhu latest Instagram Status about losing partner love goes trending

సమంత మాత్రం తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. తనకు తోచినట్టు కొన్నిసార్లు డైరెక్టుగా, మరికొన్ని సార్లు నర్మగర్బంగా పోస్టుల పెడుతుంటారు. తాజాగా జీవిత భాగస్వామి, వారిపై ప్రేమ గురించి ఓ పోస్టు పెట్టారు. జయ్ శెట్టి చెప్పిన మాటలను, ఆయన మాట్లాడిన వీడియోను తన స్టేటస్‌గా పెట్టుకొన్నారు.

హెల్త్ కన్సల్టెంట్ జయ్ శెట్టి మాట్లాడుతూ.. మీ జీవితంలో అద్బుతమైన పార్ట్‌నర్ ఉండాలి. అద్బుతమైన రిలేషన్‌షిప్ ఉంటే నిజమైన ప్రేమ లభిస్తుంది. కానీ మీరు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అప్పుడే మీ జీవిత భాగస్వామిపై మీరు అనుకొన్న ప్రేమను చూపించగలరు అని ఆయన చెప్పిన వీడియోను సమంత తన స్టేటస్‌గా పెట్టుకొన్నారు.

Samantha Ruth Prabhu latest Instagram Status about losing partner love goes trending

అయితే నర్మగర్బంగా సమంత చేసిన పోస్టు వైరల్ అయింది. ఏ ఉద్దేశంతో, దాని వెనుక పరమార్థం ఏమిటో అనే విషయాన్ని తెలియక మాత్రం అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాను శారీరకంగా మానసికంగా పర్‌ఫెక్ట్ ఉండటానికి ప్రయత్నించారు. మైయోసిటీస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పే మానసికంగా, శారీరకంగా ఫిట్ అవుతున్నారు. అయితే ఈ పోస్టు ద్వారా ఇన్ క్రిడిబుల్ పార్టనర్‌ను కోల్పోయానా? అనే విధంగా పోస్టు ఉండటంతో ఆమె జీవితంలో ఏం జరుగుతుందనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది

సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన యశోద చిత్రం విజయం సాధించగా.. శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం రాజ్ డీకే పర్యవేక్షణలో షూటింగ్ జరుపుకొంటున్న రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X