సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు
సినిమా రంగంలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా కొనసాగడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది దాదాపు పదేళ్లకు పైగానే టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' అంటూ వచ్చిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉంది. తద్వారా ఇప్పటికీ వరుసగా సినిమాలను చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోన్న సమంత.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలతో షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

స్టార్ హీరోయిన్.. ఇప్పుడు కొత్తగా
టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన సమంత.. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది. అయితే, కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ బిజీగా మారింది.

నేషనల్ రేంజ్.. బాలీవుడ్‌లోనూ
ఈ మధ్య కాలంలో దక్షిణాది భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్ ఎదిగింది. ఫలితంగా సమంతకు బాలీవుడ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొన్నింటిని ఓకే చేసింది.

ఆ మూవీ వాయిదా వేసిన టీమ్
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సామ్.. గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక, ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఆ వెంటనే దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

యశోద రెడీగా.. వాటిలో కూడా
ప్రస్తుతం సమంత 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇది నవంబర్ 11న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అలాగే, ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమాతో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్ కూడా చేయనుంది.

సోషల్ మీడియాలో సందడిగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమంత.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అయినప్పటికీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

ఓ యాడ్‌లో నటించిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన బ్రాండ్ వ్యాల్యూను అంతకంతకూ పెంచుకుంటూనే వెళ్తోంది. ఇలా ఇప్పటికే ఆమె ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'drools india' సంస్థ కోసం ఓ యాడ్ చేసింది. ఇందుకోసం ఆమె భారీగానే చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారిపోయాయి.

సమంత ఫొటోలు హాట్ టాపిక్
సమంత రూత్ ప్రభు తాజాగా 'drools india' సంస్థ కోసం ఓ యాడ్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ కనిపించనట్లుగా దర్శనమిచ్చింది. మరీ ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె ముఖంలో మార్పులు కనిపించాయి. దీంతో అసలు సమంతకు ఏమైంది? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











